News April 7, 2024
TS EAPCETకు భారీగా దరఖాస్తులు

TS EAPCET దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. ఆలస్య రుసుముతో మే 1 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటివరకు 3.41 లక్షల దరఖాస్తులు వచ్చాయి. గత ఏడాదితో పోలిస్తే 21వేల దరఖాస్తులు పెరిగాయి. దీంతో ఇంజినీరింగ్‌కు మళ్లీ డిమాండ్ పెరుగుతోందా? అనే చర్చ మొదలైంది. EAPCETకు మొత్తంగా ఈసారి 3.60 లక్షల అప్లికేషన్లు రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏపీ నుంచి ఇప్పటివరకు 57,978 మంది అప్లై చేశారని వెల్లడించారు.
Similar News
News December 29, 2025
భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్‌పై పాక్ నిషేధం

భారత్ తరఫున ఆడిన కబడ్డీ ప్లేయర్ ఉబైదుల్లా రాజ్‌పుత్‌పై పాకిస్థాన్ చర్యలు తీసుకుంది. ఈ విషయంపై అత్యవసరంగా సమావేశమైన పాక్ కబడ్డీ సమాఖ్య అతడిపై నిరవధికంగా నిషేధం విధించింది. తమ నుంచి NOC లెటర్ తీసుకోలేదని, ఎవరి అనుమతీ అడగకుండా టోర్నమెంట్లో పాల్గొన్నాడని చెప్పింది. కాగా బహ్రెయిన్‌లో జరిగిన ఓ <<18606414>>టోర్నీలో<<>> ఇండియన్ జెర్సీ, జెండాతో ఉబైదుల్లా కనిపించడం వివాదాస్పదమైంది.
News December 29, 2025
పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచే పశుగ్రాసాలివి

పాడి పశువుల పోషణలో, పాల ఉత్పత్తిలో పచ్చి పశుగ్రాసానిది కీలక పాత్ర. అధిక పోషకాలు, మాంసకృత్తులతో కూడిన గడ్డి వల్ల జీవాల్లో వ్యాధి నిరోధకశక్తి, పాల ఉత్పత్తి పెరుగుతుంది. అందుకే దాణాతో పాటు ఎండు, పచ్చి గడ్డిని పశువులకు అందించాలి. పాడి పోషణలో ప్రసిద్ధి చెందిన 4G బుల్లెట్ సూపర్ నేపియర్, సూపర్ నేపియర్, హెడ్జ్ లూసర్న్, జూరీ గడ్డిని ఎలా పెంచాలి? వీటితో లాభమేంటో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 29, 2025
ఇతిహాసాలు క్విజ్ – 111

ఈరోజు ప్రశ్న: మహాభారతంలో పాండవుల కోసం మయసభను నిర్మించింది ఎవరు? రామాయణంలో ఆయన పాత్ర ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>


