News October 6, 2025
ఇది దేశ చరిత్రలో చీకటి రోజు: సీఎం రేవంత్

సుప్రీంకోర్టులో CJI గవాయ్‌పై ఓ వ్యక్తి దాడికి ప్రయత్నించడాన్ని సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే తీవ్రంగా ఖండించారు. ‘ఇది దేశ చరిత్రలో చీకటి రోజు. ఇలాంటి దాడులు తనను ప్రభావితం చేయలేవని CJI ధైర్యంగా ప్రకటించారు’ అని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘CJIపై దాడికి యత్నం సిగ్గుచేటు. ఇది మన న్యాయవ్యవస్థ గౌరవంపై జరిగిన దాడి. జుడీషియరీ సేఫ్టీ, సెక్యూరిటీ ఎంతో ముఖ్యం’ అని ఖర్గే అన్నారు.
Similar News
News October 6, 2025
CJIపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నా: ప్రధాని

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ BR <<17928232>>గవాయ్‌పై దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ‘దీనిపై గవాయ్ గారితో మాట్లాడాను. మన సమాజంలో అలాంటి చర్యలకు తావు లేదు. ఆ ఘటన ప్రతి భారతీయుడికి కోపం తెప్పించింది. అలాంటి క్లిష్ట సమయంలో గవాయ్ శాంతంగా ఉండటాన్ని అభినందిస్తున్నా’ అని పేర్కొన్నారు.
News October 6, 2025
రేప్ కేసులో యూట్యూబర్ అరెస్ట్

మహిళా యూట్యూబర్‌పై రేప్ కేసులో బిహార్‌కు చెందిన నటుడు, యూట్యూబర్ మనీ మిరాజ్‌ను UP పోలీసులు అరెస్ట్ చేశారు. తనతో అసహజ శృంగారం చేశాడని, అబార్షన్ చేయించాడని, మతం మార్చుకోవాలని బలవంతం చేశాడని బాధితురాలు FIRలో పేర్కొన్నారు. కాగా మటన్ కొట్టులో పనిచేసే మిరాజ్ కామెడీ వీడియోలు, భోజ్‌పురీ సినిమాల ద్వారా పాపులరయ్యాడు. IPL కామెంటేటర్‌గానూ పనిచేశాడు. ఇతడికి YouTube, ఇన్‌స్టా, FBలో మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.
News October 6, 2025
కల్తీ మద్యంపై వైసీపీ ఆరోపణలు.. లోకేశ్ ఆగ్రహం

AP: ప్రభుత్వ పెద్దల అండతోనే కల్తీ మద్యం రాకెట్ నడుస్తోందన్న <<17931472>>వైసీపీ<<>> ఆరోపణలపై మంత్రి లోకేశ్ ఫైర్ అయ్యారు. ‘కల్తీ మద్యం నిందితుల్లో టీడీపీ నేతలున్నా మా ప్రభుత్వం అరెస్ట్ చేయించింది. వారిని మా అధ్యక్షుడు తెలుగుదేశం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. మీ ఐదేళ్ల పాలనలో ఏం చేశారో మరిచిపోయి ఆరోపణలు చేయొద్దు. డబ్బు కక్కుర్తితో జే బ్రాండ్స్‌తో వేల మంది ప్రజల ప్రాణాలు తీశారు’ అని ట్వీట్ చేశారు.