News October 7, 2025
ములుగు: ఎస్టీ వర్గాల మధ్య అంతర్గత చర్చలు..!

ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలని ఆదివాసీ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం, నిరసనగా లంబాడీలు రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు చేయడం ఇటీవల హాట్ టాపిక్ అయ్యాయి. స్థానిక ఎన్నికల శంఖారావం పూరించిన తర్వాత ములుగు జిల్లాలో ఈ రెండు వర్గాలు సయోధ్య కోసం అంతర్గత చర్చలు జరుపుతున్నాయని సమాచారం. తమ జనాభా ఎక్కువగా ఉన్న చోట తమ వర్గానికే పోటీకి అవకాశం కల్పించాలని, ఇందుకోసం పరస్పరం సహకరించుకోవాలని అనుకున్నారట.
Similar News
News October 7, 2025
ఒకే వ్యక్తికి 1,638 క్రెడిట్ కార్డులు.. మీకు తెలుసా?

అత్యధిక(1,638) వాలిడ్ క్రెడిట్ కార్డులున్న వ్యక్తిగా భారత్‌కు చెందిన మనీశ్ ధామేజా పేరిట గిన్నిస్ వరల్డ్ రికార్డు ఉంది. తనకు క్రెడిట్ కార్డ్స్ ఇష్టమని, వాటి ద్వారా వచ్చే రివార్డ్స్, బెనిఫిట్స్ అద్భుతమని ఆయన పేర్కొన్నారు. పాత నోట్ల రద్దు సమయంలో అవి చాలా ఉపయోగపడ్డాయన్నారు. ఇదే కాకుండా 10L+ నాణేలు సేకరించిన గిన్నిస్ రికార్డు కూడా ఆయన సొంతం. కాగా ఓ వ్యక్తి దగ్గర ఎన్ని క్రెడిట్ కార్డులైనా ఉండవచ్చు.
News October 7, 2025
HYD: భద్రతపై యాక్షన్ ప్లాన్ రెడీ: కర్ణన్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ జారీతోనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి వచ్చిందని ఎన్నికల అధికారి కర్ణన్ తెలిపారు. హైదరాబాద్ నగర పోలీసులతో యాక్షన్ ప్లాన్ రెడీ అయిందని, ఎన్‌ఫోర్స్‌మెంట్ కోసం 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్, 9 స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్, 2 వీడియో సర్వేలెన్స్ టీమ్స్‌తో పాటు ఇతరత్రా టీమ్స్ ఉన్నాయని, అవసరాలకు అనుగుణంగా టీమ్స్ పెంచుతామన్నారు.