News October 8, 2025

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో వాదనలు

image

TG: బీసీ రిజర్వేషన్ల పెంపు GOపై విచారణ జరుపుతున్న హైకోర్టు.. బిల్లు పాస్ అయిందా అని ప్రశ్నించింది. అసెంబ్లీలో పాస్ అయిందని, గవర్నర్ దగ్గర పెండింగ్‌లో ఉందని అడ్వకేట్ జనరల్ చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైనా.. రిజర్వేషన్లు 50 శాతం మించితే ఎన్నికలు రద్దు అవుతాయనే నిబంధన ఉందని పిటిషనర్ల తరఫు లాయర్లు వాదించారు. వన్‌మెన్ కమిషన్ నివేదికను బహిర్గతం చేయలేదని పేర్కొన్నారు.

Similar News

News October 8, 2025

ఇతిహాసాలు క్విజ్ – 29 సమాధానాలు

image

1. వశిష్ట మహాముని భార్య ‘అరుంధతి’.
2. కురుక్షేత్ర యుద్ధం 18 రోజులు జరిగింది.
3. తిరుమలలో స్వామివారికి ఉదయం సుప్రభాత సేవ నిర్వహిస్తారు.
4. శివుడు వాయు లింగంగా కొలువైన ఆలయం ‘శ్రీకాళహస్తి’.
5. జీవితంలోని పురుషార్థాలు 4. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు.
<<-se>>#Ithihasaluquiz<<>>

News October 8, 2025

చికిత్స తర్వాత బ్రెస్ట్ క్యాన్సర్ తిరిగి వస్తుందా?

image

మహిళలు ఎదుర్కొంటున్న ప్రమాదకర క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. అయితే చికిత్స తర్వాత క్యాన్సర్ తగ్గిపోయినట్టు కనిపించినా కొన్నిసార్లు తిరిగిరావొచ్చంటున్నారు నిపుణులు. కొన్ని క్యాన్సర్ కణాలు నిద్రాణ స్థితిలో ఉండి గుర్తించలేనివిగా ఉంటాయి. కాబట్టి చికిత్స తర్వాత కూడా చెకప్‌లు చేయించుకోవాలి. అలాగే శరీరంలో ఏవైనా అసాధారణమైన లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది. <<-se>>#WomenHealth<<>>

News October 8, 2025

ట్రిపుల్ టెస్ట్ సర్వే అంటే ఏంటి?

image

TG: BC రిజర్వేషన్ల‌పై విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు లాయర్లు ట్రిపుల్ టెస్ట్ సర్వే అంశాన్ని కోర్టులో ప్రస్తావించారు. 2021లో వికాస్ కిషన్‌రావ్ గవాలీ వర్సెస్ స్టేట్ ఆఫ్ MH, ఇతరుల కేసుల్లో SC ట్రిపుల్ టెస్ట్‌ను ఏర్పాటు చేసింది. అదేంటంటే?
✎ OBC వెనుకబాటుతనంపై కమిషన్ ఏర్పాటు చేయాలి.
✎ ఆ కమిషన్ ఇచ్చే డేటా బేస్ చేసుకొని రిజర్వేషన్ % నిర్ణయించాలి.
✎ SC, ST, OBC రిజర్వేషన్లు మొత్తం 50% మించకూడదు.