News April 9, 2024
సీఈవోల సగటు వార్షిక వేతనం రూ.13.8 కోట్లు: డెలాయిట్
మన దేశంలోని కార్పొరేట్ కంపెనీల సీఈవోల సగటు వార్షిక వేతనం రూ.13.8 కోట్లకు చేరినట్లు డెలాయిట్ నివేదిక వెల్లడించింది. కరోనాకు ముందుకంటే ఇది 40% అధికమని తెలిపింది. కంపెనీల ప్రమోటర్లు, వారి కుటుంబాలకు చెందిన సీఈవోలకు సగటున రూ.16.7 కోట్ల జీతం ఉంటోందని పేర్కొంది. ఐదేళ్లలో 45 శాతం సంస్థల్లో CEOల మార్పు జరిగిందని, ప్రతి 10 మంది CEOల్లో ఆరుగురిని సొంత కంపెనీల నుంచే ఎంపిక చేశారని చెప్పింది.
Similar News
News January 12, 2025
12 లక్షల కుటుంబాలకు ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’!
TG: ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని నిరుపేదలకు ఏటా రూ.12వేలు ఇవ్వాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దాదాపు 12 లక్షల కుటుంబాలకు ఈ నగదు ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తొలి విడత రూ.6వేల చొప్పున నేరుగా అకౌంట్లలోకి జమ చేయనుంది. కాగా ఈ పథకానికి అర్హులుగా భూమి లేని నిరుపేదలై ఉండి కనీసం 20 రోజులు ఉపాధి హామీ పనులకు వెళ్లినవారిని పరిగణనలోకి తీసుకోనుంది.
News January 12, 2025
శ్రీవారితో రాజకీయాలు చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయి: కన్నబాబు
AP: తిరుమల ప్రసాదాన్ని కూటమి సర్కార్ రాజకీయం చేసిందని, అలా చేస్తే ఫలితాలు ఇలానే ఉంటాయని వైసీపీ నేత కన్నబాబు అన్నారు. తిరుపతి తొక్కిసలాటపై సీఎం చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘తిరుపతి తొక్కిసలాట ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక పదం క్షమాపణ అన్నట్లు టీటీడీ ఛైర్మన్ మాట్లాడుతున్నారు. ఈ సంక్రాంతి పేదల పండుగ కాదు.. పచ్చ నేతల పండుగ’ అని ఆయన ధ్వజమెత్తారు.
News January 12, 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ టీమ్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు మిచెల్ శాంట్నర్ సారథ్యం వహిస్తారు. సీనియర్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చారు. జట్టు: శాంట్నర్ (C), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేవాన్ కాన్వే, లాకీ ఫెర్గ్యూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్సన్, విల్ యంగ్.