News January 12, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ టీమ్ ఇదే

image

ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు మిచెల్ శాంట్నర్ సారథ్యం వహిస్తారు. సీనియర్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చారు. జట్టు: శాంట్నర్ (C), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేవాన్ కాన్వే, లాకీ ఫెర్గ్యూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్సన్, విల్ యంగ్.

Similar News

News February 18, 2025

BREAKING: కొత్త CECగా జ్ఞానేశ్ కుమార్

image

కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌(CEC)గా జ్ఞానేశ్ కుమార్ ఎంపికయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి కార్యాలయం తాజాగా గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. జ్ఞానేశ్ కుమార్ పేరు గత కొన్ని రోజులుగా అందరి నోటా నానుతుండగా ఈరోజు అధికారికంగా ప్రకటన వెలువడింది. ప్రస్తుత CEC రాజీవ్ కుమార్ పదవీకాలం రేపటితో ముగియనుంది.

News February 18, 2025

ఎండాకాలం: ఈసారి హాటెస్ట్ సిటీగా బెంగళూరు!

image

దేశంలో ఈసారి ఎండలు మండిపోతాయని, అత్యంత వేడి నగరంగా బెంగళూరు నిలవనుందని IMD అంచనా వేసింది. ఏటా వేసవిలో ఢిల్లీలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. అయితే ఈసారి ఢిల్లీ కంటే బెంగళూరులోనే రికార్డ్ స్థాయి టెంపరేచర్ నమోదవుతుందని పేర్కొంది. సిలికాన్ సిటీలో ఇవాళ 35.9 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, ఢిల్లీలో 27 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ నమోదవడం గమనార్హం.

News February 17, 2025

టీమ్ ఇండియా ఫొటోషూట్.. పిక్స్ వైరల్

image

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 కోసం టీమ్ ఇండియా ఫొటో సెషన్‌లో పాల్గొంది. ఇందులో భారత ఆటగాళ్లు రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అర్ష్‌దీప్ సింగ్ తదితరులు సందడి చేశారు. టీ20 టీమ్, టెస్టు టీమ్ క్యాప్‌లు ధరించి ఫొటోలకు పోజులిచ్చారు. ఈ జెర్సీలపై పాకిస్థాన్ అని పేరు రాసి ఉండటం గమనార్హం. ఇందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

error: Content is protected !!