News April 9, 2024

IPL: లక్నోకు షాక్.. కీలక ఆటగాళ్లకు గాయాలు

image

IPLలో వరుస విజయాలతో దూసుకుపోతోన్న లక్నో సూపర్ జెయింట్స్‌కు షాక్ తగిలింది. ఆ జట్టు పేసర్లు మయాంక్ యాదవ్, మోసిన్ ఖాన్ గాయాల బారిన పడ్డారు. దీంతో వీరు ఈ నెల 12న DCతో జరిగే మ్యాచ్‌కు దూరం కానున్నట్లు సమాచారం. GTతో మ్యాచ్‌లో మయాంక్‌కు పొత్తి కడుపులో గాయమైనట్లు లక్నో యాజమాన్యం తెలిపింది. వారం పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచనున్నట్లు పేర్కొంది. మోసిన్ ఖాన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నట్లు వెల్లడించింది.

Similar News

News January 12, 2025

ఛాంపియన్స్ ట్రోఫీకి కివీస్ టీమ్ ఇదే

image

ఛాంపియన్స్ ట్రోఫీకి న్యూజిలాండ్ తమ జట్టును ప్రకటించింది. 15 మందితో కూడిన ఈ జట్టుకు మిచెల్ శాంట్నర్ సారథ్యం వహిస్తారు. సీనియర్ ప్లేయర్ కేన్ విలియమ్సన్ రీఎంట్రీ ఇచ్చారు. జట్టు: శాంట్నర్ (C), మైకేల్ బ్రేస్‌వెల్, మార్క్ చాప్‌మన్, డేవాన్ కాన్వే, లాకీ ఫెర్గ్యూసన్, మాట్ హెన్రీ, టామ్ లాథమ్, డారిల్ మిచెల్, విల్ ఓ రూర్కీ, గ్లెన్ ఫిలిప్స్, రచిన్ రవీంద్ర, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, విలియమ్సన్, విల్ యంగ్.

News January 12, 2025

ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టుల మృతి

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. మద్దేడు పీఎస్ పరిధిలో ఈ ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. సంఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు లభించాయి. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News January 12, 2025

బాధితులకు టీటీడీ చెక్కుల పంపిణీ

image

AP: తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు టీటీడీ నష్టపరిహారం అందజేసింది. ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన 4 కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసింది. లావణ్య, రజనీ, శాంతి కుటుంబసభ్యులకు రూ.25 లక్షలు అందించింది. అలాగే మృతుల కుటుంబాల్లో ఒకరికి టీటీడీలో కాంట్రాక్టు ఉద్యోగం కల్పించనుంది. మృతుల పిల్లలకు ఉచిత విద్య అందించనుంది.