News April 9, 2024
BREAKING: గుండెపోటుతో ఐపీఎస్ అధికారి కన్నుమూత
TG: సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్ గుండెపోటుతో చనిపోయారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మరణించారు. ప్రస్తుతం ఆయన విజిలెన్స్ డీజీగా ఉన్నారు. ఈయన 1991 బ్యాచ్‌కు చెందినవారు. గతంలో ఆపరేషన్ ఐజీ, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ, కరీంనగర్ ఎస్పీగా చేశారు.
Similar News
News January 10, 2025
ఉద్యోగులమా? లేక కాడెద్దులమా?
ఒత్తిడి పెరిగి ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నా యజమానుల తీరు మారట్లేదు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని వారు పట్టించుకోవట్లేదని విమర్శలొస్తున్నాయి. తాజాగా L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటలు పని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాడెద్దుల్లా పనిచేయాలన్నట్లు వారు ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి ఉద్యోగం చేస్తున్నా గుర్తింపులేదని వాపోతున్నారు.
News January 10, 2025
నేడు TTD ధర్మకర్తల మండలి అత్యవసర భేటీ
AP: తిరుమలలో ఇవాళ సా.4 గంటలకు TTD ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం కానుంది. తిరుపతి తొక్కిసలాట మృతుల కుటుంబాలకు పరిహారంపై ఇందులో తీర్మానించనున్నట్లు సమాచారం. సాయంత్రానికి చెక్కులు తయారు చేసి, రేపు ఉదయానికల్లా ముగ్గురు టీటీడీ బోర్డు సభ్యుల బృందం మృతుల గ్రామాలకే వెళ్లి వాటిని అందజేసే అంశంపైనా చర్చించనున్నారు. తొక్కిసలాటలో ఆరుగురు చనిపోగా రూ.25లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే.
News January 10, 2025
OTTలోకి వచ్చేసిన కొత్త సినిమా
అల్లరి నరేశ్ నటించిన ‘బచ్చలమల్లి’ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులోకి వచ్చింది. ఇవాళ్టి నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సుబ్బు మంగదేవి డైరెక్ట్ చేసిన ఈ మూవీ గత నెల 20న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. నరేశ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. ఇందులో అమృత అయ్యర్ హీరోయిన్‌గా నటించగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.