News January 10, 2025
ఉద్యోగులమా? లేక కాడెద్దులమా?
ఒత్తిడి పెరిగి ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు పెరుగుతున్నా యజమానుల తీరు మారట్లేదు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని వారు పట్టించుకోవట్లేదని విమర్శలొస్తున్నాయి. తాజాగా L&T ఛైర్మన్ సుబ్రహ్మణ్యన్ 90 గంటలు పని వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కాడెద్దుల్లా పనిచేయాలన్నట్లు వారు ప్రవర్తిస్తున్నారని నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యక్తిగత జీవితాన్ని పక్కనపెట్టి ఉద్యోగం చేస్తున్నా గుర్తింపులేదని వాపోతున్నారు.
Similar News
News January 16, 2025
Q3లో రిలయన్స్, జియో ఆదాయాలు ఇలా..
2024-25 Q3లో 7 శాతం వృద్ధితో రూ.18,540 కోట్ల నికర ఆదాయం వచ్చినట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రకటించింది. మొత్తం ఆదాయం రూ.2.43 లక్షల కోట్లకు చేరినట్లు తెలిపింది. ఇక డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికానికి జియో ఆదాయం రూ.6,681 కోట్లుగా నమోదైనట్లు పేర్కొంది. 2023 డిసెంబర్ నాటికి రూ.5,447 కోట్లు ఉండగా ఈసారి 26 శాతం పెరిగినట్లు వెల్లడించింది.
News January 16, 2025
నితీశ్‌కు లోకేశ్ అభినందనలు
AP: రాష్ట్రంలోని యువ క్రీడాకారులకు క్రికెటర్ నితీశ్ కుమార్ రెడ్డి స్ఫూర్తిగా నిలిచారని మంత్రి లోకేశ్ కొనియాడారు. భారత జట్టుకు మరింతగా సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఇటీవల ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్‌లో సత్తా చాటిన నితీశ్ మంత్రిని తాజాగా కలిసారు. ఈ సందర్భంగా మంగళగిరి చేనేత శాలువాతో సన్మానించిన లోకేశ్, జ్ఞాపికను అందించారు.
News January 16, 2025
ఫిబ్రవరి 14 నుంచి WPL ప్రారంభం
వచ్చే నెల 14 నుంచి ఉమెన్స్ ప్రీమియర్ లీగ్(WPL) ప్రారంభం కానున్నట్లు BCCI ప్రకటించింది. బరోడా వేదికగా బెంగళూరు-గుజరాత్ మధ్య తొలి మ్యాచ్‌తో సమరానికి తెర లేవనుంది. మొత్తం 5 జట్లు పాల్గొనే ఈ మెగా ఈవెంట్‌లో 22 మ్యాచ్‌లు జరుగుతాయి. బరోడాతో పాటు బెంగళూరు, లక్నో, ముంబైని వేదికలుగా ఖరారు చేశారు. మార్చి 15న ముంబైలో ఫైనల్ జరగనుంది. పూర్తి షెడ్యూల్‌ను పైన ఫొటోల్లో చూడొచ్చు.