News April 9, 2024

ఇజ్రాయెల్‌పై టర్కీ ఆంక్షలు

image

హమాస్‌పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని వ్యతిరేకిస్తున్న టర్కీ, తాజాగా ఆ దేశంపై వాణిజ్యపరమైన ఆంక్షల్ని విధించింది. సిమెంట్, ఉక్కు సహా 54 ఉత్పత్తులపై నేటి నుంచి ఎగుమతి ఆంక్షలు అమల్లోకి వస్తాయని ప్రకటించింది. గాజాలో ఇజ్రాయెల్ యుద్ధాన్ని ఆపి, పాలస్తీనావాసులకు సహాయాన్ని వెళ్లనిచ్చేవరకూ వీటిని సడలించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ ఒక ఉగ్రదేశంలా మారిందంటూ టర్కీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.

Similar News

News November 15, 2024

ఆటిజంపై స్పెషల్ ఫోకస్: మంత్రి సత్యకుమార్

image

AP: రాష్ట్రంలో ఆటిజం లక్షణాలున్న పిల్లలను గుర్తించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు హెల్త్ మినిస్టర్ సత్య కుమార్ వెల్లడించారు. మొదటి రెండేళ్లలో లక్షణాలను గుర్తిస్తే దీన్ని నివారించగలమని అసెంబ్లీలో అన్నారు. దీనిపై ఇతర రాష్ట్రాల్లో పాటిస్తున్న తీరును పరిశీలిస్తామని తెలిపారు. ఆటిజం చికిత్సను ఎన్టీఆర్ వైద్య సేవ కింద చేర్చేందుకు యత్నిస్తున్నామన్నారు.

News November 15, 2024

ఇంగ్లండ్ టార్గెట్ 146 రన్స్

image

ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ పావెల్(54), రొమారియో షెఫర్డ్(30) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, ఓవర్టన్ 3, ఆర్చర్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే 146 రన్స్ చేయాలి.

News November 15, 2024

మహిళా మంత్రిని భయపెడుతున్న అరటిపండ్లు!

image

స్విడన్‌లో జెండర్ ఈక్వాలిటీ మినిస్టర్ పౌలినా బ్రాండ్‌బర్గ్‌ అరటి పండ్లను చూస్తే ఆమడదూరం పరిగెత్తుతున్నారు. ఆమెకు బనాన ఫోబియా ఉంది. అందుకే తాను ఎక్కడ పర్యటనకు వెళ్లినా ముందే అక్కడి అధికారులతో ‘బనానా ఫ్రీ’ జోన్‌లను ఏర్పాటు చేయమని మెయిల్స్ చేస్తున్నారు. ఫోబియా నుంచి బయటపడేందుకు ఆమె చికిత్స పొందుతున్నారు. వినడానికి వింతగా ఉన్నా ఈ ఫోబియా ఉన్నవారికి అరటి పండ్లను చూస్తే వికారం, ఆందోళన కలుగుతుంది.