News November 15, 2024
ఇంగ్లండ్ టార్గెట్ 146 రన్స్

ఇంగ్లండ్‌తో మూడో టీ20లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ బ్యాటర్లు తడబడ్డారు. దీంతో విండీస్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 రన్స్ మాత్రమే చేసింది. కెప్టెన్ పావెల్(54), రొమారియో షెఫర్డ్(30) రాణించారు. ఇంగ్లండ్ బౌలర్లలో సాకిబ్ మహమూద్ 3, ఓవర్టన్ 3, ఆర్చర్ 1 వికెట్ తీశారు. ఇంగ్లండ్ గెలవాలంటే 146 రన్స్ చేయాలి.
Similar News
News April 18, 2026
ఫోన్లలో ‘ఆధార్’ యాప్ ప్రీఇన్‌స్టాలేషన్‌పై కేంద్రం యూటర్న్

స్మార్ట్ ఫోన్లలో ఆధార్ యాప్‌ను ప్రీ ఇన్‌స్టాల్ చేయాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఈ ప్రతిపాదనపై యాపిల్, శామ్‌సంగ్ వంటి కంపెనీల నుంచి వ్యతిరేకత వచ్చినట్లు రాయిటర్స్ తెలిపింది. ఫోన్‌లలో ప్రభుత్వ యాప్‌లను ముందే ఇన్‌స్టాల్ చేయడం వల్ల డివైజ్‌ల భద్రతకు, యూజర్ల డేటా గోప్యతకు భంగం కలగవచ్చని కంపెనీలు అభిప్రాయపడినట్లు పేర్కొంది. ఫోన్ పనితీరుపైనా ప్రభావం పడొచ్చని చెప్పినట్లు సమాచారం.
News April 18, 2026
మోదీని ఇంతలా మోయాలా జగన్: షర్మిల

AP: బీజేపీతో <<19677732>>జగన్<<>> పెట్టుకున్న అక్రమ పొత్తు తేటతెల్లమైందని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. ‘టీడీపీ, జనసేనల కంటే మోదీని ఇంతలా మోయాలా? అక్రమ డీలిమిటేషన్ బిల్లులపై NDA పక్షాన నిలబడ్డందుకు జగన్ సిగ్గుపడాలి. కేసుల నుంచి రక్షణ కోసం బానిసగా బతకాలా? జగన్ చేసిన ఈ నీచపు పనికి YSR ఆత్మ నిజంగా ఘోషిస్తోంది. ఏపీలో బీజేపీ అంటే చంద్రబాబు, జగన్, పవన్ కళ్యాణ్. ప్రతిపక్షం ఒక్క కాంగ్రెస్ మాత్రమే’ అని స్పష్టం చేశారు.
News April 18, 2026
499/500.. 1 మార్క్ కోసం రీవాల్యుయేషన్‌కు వెళ్లిన అమ్మాయి!

CBSE టెన్త్ ఫలితాల్లో 90% వస్తేనే చాలామంది పండగ చేసుకుంటారు. కానీ ఆషిమాకు(కేరళం) 499 వచ్చినా సంతృప్తి చెందలేదు. తనకు అన్యాయం జరిగిందంటూ రీవాల్యుయేషన్‌కు రెడీ అయిపోయింది. అన్నింట్లో 100కు 100రాగా.. సైన్స్‌లో మాత్రం 99 వచ్చాయి. ఆ ఒక్క మార్కు కూడా తెచ్చుకొని 500/500 సాధిస్తానని ఆషిమా ధీమా వ్యక్తం చేస్తోంది. ‘టాపర్ కష్టాలు’ అంటే ఇవేనేమో అని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.


