News April 9, 2024
ఆ సమయంలో కెప్టెన్సీ చేయడం నా దురదృష్టం: దినేశ్ కార్తీక్
ఆర్సీబీ ప్లేయర్ దినేశ్ కార్తీక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను KKR కెప్టెన్‌గా ఉన్నప్పుడు కుల్దీప్ యాదవ్ రాణించలేదని గుర్తు చేశారు. దీంతో అతడిని బెంచ్‌కు పరిమితం చేసినట్లు తెలిపారు. ఆ సమయంలో కుల్దీప్తో మాట్లాడటమే ఇబ్బందిగా అనిపించేదన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని కుల్దీప్ టాప్ బౌలర్‌గా ఎదిగారని తెలిపారు. ఫామ్‌లో లేని సమయంలో కెప్టెన్సీ వహించడం తన దురదృష్టమని చెప్పుకొచ్చారు.
Similar News
News October 10, 2024
నన్ను చంపాలనుకున్నారనే ప్రచారం జరిగింది: సీఎం
AP: YCP హయాంలో అందరికంటే ఎక్కువ వేధింపులకు గురైంది తానేనని CM చంద్రబాబు అన్నారు. ‘నేను జైలులో ఉన్నప్పుడు నన్ను చంపేందుకు కుట్ర పన్నారనే ప్రచారం జరిగింది. జైలుపై డ్రోన్లు ఎగురవేశారు. CC కెమెరాలు పెట్టారు. దోమ తెర కూడా ఇవ్వలేదు. కక్ష తీర్చుకోవడం నా లక్ష్యం కాదు. సోషల్ మీడియాలో ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారం ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. మరీ మితిమీరితే ఏం చేయాలో నాకు తెలుసు’ అని వ్యాఖ్యానించారు.
News October 10, 2024
ఆయూష్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్
AP: బీఏఎంఎస్, BHMS, BUMS కోర్సుల్లో ప్రవేశాలకు ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసింది. నీట్ యూజీ-2024లో అర్హత పొందిన విద్యార్థులు ఈ నెల 14వ తేదీలోపు వర్సిటీ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలంది. ఇటు MBBS మేనేజ్మెంట్ కోటాలో చేరిన విద్యార్థులు ఈ నెల 14తేదీ లోపు ఫ్రీఎగ్జిట్ అవ్వొచ్చని తెలిపింది. దివ్యాంగ కోటాలో కన్వీనర్ సీట్లు పొందిన వారు ఈ నెల 11లోపు కాలేజీల్లో రిపోర్ట్ చేయాలంది.
News October 10, 2024
పల్లె పండుగ పనులపై మార్గదర్శకాలు జారీ
AP: పల్లె పండుగ పేరిట పంచాయతీల్లో ఈ నెల 14- 20వ తేదీ వరకు అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఈ పనులను JAN నెలాఖరులోగా పూర్తి చేయాలని పంచాయతీరాజ్ శాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం నిబంధనలకు అనుగుణంగా పనులు నిర్వహించాలంది. జియో ట్యాగింగ్ సహా అన్ని వివరాలను పీఆర్ వన్ యాప్‌లో నమోదు చేయాలని అధికారులకు సూచించింది. సోషల్ ఆడిట్ అనంతరం బిల్లులు చెల్లిస్తామంది.