News April 9, 2024
జగన్ తప్ప ఎవరూ బాగుపడలేదు: చంద్రబాబు

APలో గత 5 ఏళ్లలో జగన్ తప్ప ఎవరూ బాగుపడలేదని TDP అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ విరాళాల కోసం వెబ్‌సైటును ప్రారంభించిన ఆయన.. ‘ప్రతి ఒక్క వర్గం నష్టపోయింది. దేశం సరైన దిశలో వెళ్తుంటే.. ఏపీ రివర్స్‌లో వెళ్తోంది. జగన్‌పై జనంలో అసహనం కనిపిస్తోంది. APని ఇలా చేసిన YCPకి ఒక్క సీటు కూడా రాకూడదు. ప్రతి ఇంటిపై కూటమి జెండాలు ఎగురవేయాలి. రేపట్నుంచి నేను, పవన్ ప్రచారంలో పాల్గొంటాం’ అని వెల్లడించారు.
Similar News
News March 21, 2026
మోదీనే అతిపెద్ద చొరబాటుదారుడు: సీఎం మమత

బెంగాల్ ఎన్నికల్లో అక్రమ వలసల అంశం బీజేపీకి ప్రచారాస్త్రంగా మారిన వేళ ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ దీనిపై కౌంటర్ ఇచ్చారు. బెంగాల్‌ను టార్గెట్ చేసేవారు నరకానికి వెళ్తారని.. ప్రధాని మోదీ, ఆయన ప్రభుత్వమే అతిపెద్ద చొరబాటుదారులని విమర్శించారు. కోల్‌కతాలోని ఈద్ ఈవెంట్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా ఇప్పటికే SIRపైనా మమత విమర్శలు గుప్పించారు. BJP ప్రజల హక్కులను లాక్కోవాలని ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
News March 21, 2026
7 కేజీల బరువు తగ్గా: శ్రేయస్

గాయం కారణంగా గతేడాది తనకు కష్టంగా గడిచిందని PBKS కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెల్లడించారు. దాదాపు 7KGల బరువు తగ్గినట్లు తెలిపారు. గాయం నుంచి కోలుకొని మళ్లీ బరువు పెరిగి ఫిట్‌నెస్ సాధించడానికి తీవ్రంగా కష్టపడినట్లు గుర్తు చేసుకున్నారు. తనకు ఛాలెంజెస్ అంటే ఇష్టమన్నారు. ‘2025 IPLలో రన్నరప్‌గా నిలిచాం. ఈ ఏడాది మా జట్టుపై భారీ అంచనాలున్నాయి. నా కన్ను ట్రోఫీపైనే ఉంది’ అని పేర్కొన్నారు.
News March 21, 2026
ప్రతి 45 రోజులకు ఒక కొత్త ఎయిర్‌పోర్ట్: రామ్మోహన్

దేశంలో ప్రతి 45 రోజులకు ఒక ఎయిర్‌పోర్ట్ ప్రారంభిస్తున్నామని కేంద్రమంత్రి రామ్మోహన్ అన్నారు. విశాఖలో ఓ ప్రోగ్రామ్‌లో మాట్లాడుతూ.. ప్రపంచంలోనే IND అత్యంత సురక్షితమైన, వేగంగా అభివృద్ధి చెందుతున్న విమానయాన మార్కెట్‌గా అవతరించిందని చెప్పారు. APలోని, TGలోని పలు కొత్త విమానాశ్రయాల పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. NDA అధికారంలోకి వచ్చేనాటికి తక్కువగా ఉన్న ఎయిర్‌పోర్టుల సంఖ్య 167కి చేరిందని చెప్పారు.


