News April 9, 2024

జగన్ తప్ప ఎవరూ బాగుపడలేదు: చంద్రబాబు

image

APలో గత 5 ఏళ్లలో జగన్ తప్ప ఎవరూ బాగుపడలేదని TDP అధినేత చంద్రబాబు ఆరోపించారు. టీడీపీ విరాళాల కోసం వెబ్‌సైటును ప్రారంభించిన ఆయన.. ‘ప్రతి ఒక్క వర్గం నష్టపోయింది. దేశం సరైన దిశలో వెళ్తుంటే.. ఏపీ రివర్స్‌లో వెళ్తోంది. జగన్‌పై జనంలో అసహనం కనిపిస్తోంది. APని ఇలా చేసిన YCPకి ఒక్క సీటు కూడా రాకూడదు. ప్రతి ఇంటిపై కూటమి జెండాలు ఎగురవేయాలి. రేపట్నుంచి నేను, పవన్ ప్రచారంలో పాల్గొంటాం’ అని వెల్లడించారు.

Similar News

News March 19, 2025

IPLలో పర్పుల్ క్యాప్ హోల్డర్స్

image

*2008- సోహైల్ తన్వీర్ *2009- ఆర్పీ సింగ్
*2010- ప్రజ్ఞాన్ ఓఝా *2011- లసిత్ మలింగ
*2012- మోర్నే మోర్కెల్ *2013- డ్వేన్ బ్రావో
*2014- మోహిత్ శర్మ *2015- డ్వేన్ బ్రావో
*2016, 17- భువనేశ్వర్ కుమార్ *2018- ఆండ్రూ టై
*2019- ఇమ్రాన్ తాహిర్ *2020- కగిసో రబాడ
*2021- హర్షల్ పటేల్ *2022- యుజువేంద్ర చాహల్
*2023- మహమ్మద్ షమీ *2024- హర్షల్ పటేల్
*2025- ?

News March 19, 2025

అంతరిక్షంలో అత్యధిక రోజులు గడిపింది వీరే!

image

దాదాపు 9 నెలల తర్వాత ISS నుంచి భూమికి చేరిన సునీతా విలియమ్స్‌పై ప్రపంచం దృష్టి నెలకొంది. కాగా అంతరిక్షంలో ఒకే ప్రయాణంలో అత్యధిక రోజులు గడిపిన వ్యక్తుల్లో వాలేరి పోలికోవ్(రష్యా-437 డేస్) తొలి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత ఫ్రాంక్ రుబియో(US-371d), మార్క్ వాండె(355), స్కాట్ కెల్లీ(340) ఉన్నారు. సునీత, విల్మోర్ తలో 286 డేస్ అంతరిక్షంలో ఉన్నారు. కాగా సునీత తన మూడు ప్రయాణాల్లో 608 రోజులు రోదసిలో ఉన్నారు.

News March 19, 2025

ఇంకోసారి అలా అనొద్దు.. ABDకి కోహ్లీ సూచన

image

ఐపీఎల్-2025కి ముందు ఆర్సీబీ మాజీ ప్లేయర్ ఏబీ డివిలియర్స్ ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘ఈసాల కప్ నమ్దే’ (ఈసారి కప్ మనదే) నినాదాన్ని ఇకపై పబ్లిక్‌లో వాడొద్దని కోహ్లీ తనకు మెసేజ్ చేసినట్లు తెలిపారు. ‘వరల్డ్ కప్‌ను ఈజీగా గెలవచ్చేమో కానీ ఐపీఎల్ ట్రోఫీని గెలవడం అంత సులభం కాదు. ఈ టోర్నీ చాలా కఠినతరంగా ఉంటుంది’ అని పేర్కొన్నారు. 2011-21 మధ్య ABD ఆర్సీబీకి ఆడిన సంగతి తెలిసిందే.

error: Content is protected !!