News April 9, 2024

పంజాబ్ టార్గెట్ 183 పరుగులు

image

IPLలో భాగంగా పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో SRH 20 ఓవర్లలో 182/9 రన్స్ చేసింది. టాపార్డర్ వికెట్లు త్వరగా కోల్పోయిన సమయంలో తెలుగుతేజం నితీశ్ కుమార్ రెడ్డి 37 బంతుల్లో 64 రన్స్ చేసి SRH స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. మిగతా ప్లేయర్లు కూడా తక్కువ స్కోరుకే ఔటయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ 4 వికెట్లు తీసి SRHను దెబ్బ కొట్టగా.. హర్షల్ పటేల్, కర్రన్ చెరో 2 వికెట్లు, రబడ ఒక వికెట్ తీశారు.

Similar News

News February 8, 2026

కోనసీమ: ఈనెల 9న ‘డయల్ యువర్ సీఎండి’

image

విద్యుత్ సమస్యల పరిష్కారానికి ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ‘డయల్ యువర్ సీఎండి’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఈ నెల 9 నుంచి ప్రతి సోమవారం ఈ కార్యక్రమం జరుగుతుందని ఆయన తెలిపారు. కోనసీమ జిల్లా వినియోగదారులు 8688400499 నంబరుకు కాల్ చేసి తమ ఫిర్యాదులను నేరుగా సీఎండికి తెలియజేయవచ్చు. విద్యుత్ సేవలలో జాప్యాన్ని అరికట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

News February 8, 2026

TODAY HEADLINES

image

⋆ AP: అమరావతిలో క్వాంటం వ్యాలీకి శంకుస్థాపన
⋆ క్వాంటం వ్యాలీ దేశానికే గేమ్ ఛేంజర్: CM చంద్రబాబు
⋆ ఏపీలో పంచాయతీ ఎన్నికలకు SEC సన్నాహాలు
⋆ TG: కేసీఆర్ మనోడు కాదు పరాయి వాడు: CM రేవంత్
⋆ KCRపై చర్యలు తీసుకునే దమ్ము రేవంత్‌కు లేదా: కిషన్ రెడ్డి
⋆ రేవంత్ ఎప్పటికీ కాంగ్రెస్ మనిషి కాలేరు: KTR
⋆ పెరిగిన బంగారం, వెండి ధరలు
⋆ టీ20 WC: USAపై భారత్ విజయం

News February 8, 2026

బాబర్ ఆజంను దాటేసిన సూర్యకుమార్

image

ముంబై వేదికగా జరిగిన T20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో టీమ్ ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ సరికొత్త రికార్డు నెలకొల్పారు. USతో జరిగిన డెబ్యూ మ్యాచ్‌లోనే 84 (నాటౌట్) రన్స్‌తో అదరగొట్టిన అతడు.. బాబర్ ఆజం రికార్డును తుడిచిపెట్టేశారు. టీ20 వరల్డ్ కప్ కెప్టెన్సీ డెబ్యూలో అత్యధిక స్కోరు చేసిన రెండో ఆటగాడిగా నిలిచారు. 2021లో భారత్‌పై బాబర్ చేసిన 68 రన్స్ రికార్డును దాటి క్రిస్ గేల్ (88) తర్వాతి స్థానంలో ఉన్నారు.