News April 9, 2024
అక్కడ మ్యూజిక్ స్పీడ్ పెరిగినా, తగ్గినా ఆర్టిస్టులకు బ్యాండే!

‘మరీ హై కాకుండా, మరీ లోగా కాకుండా మీడియంగా కొట్టరా’.. ఓ సినిమాలోని ఈ డైలాగ్‌ను రష్యన్ రిపబ్లిక్ ఆఫ్ చచ్‌న్యా సీరియస్‌గా తీసుకుందేమో! నిమిషానికి 80-116 బీట్లు ఉన్న టెంపోలనే పరిగణిస్తామని మ్యూజిక్‌పై ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. అంతకంటే స్లో లేదా స్పీడ్ ఉన్న మ్యూజిక్‌ను నిషేధిస్తూ, రీరైట్ చేసుకోవడానికి ఆర్టిస్టులకు JUN 1 వరకు గడువు ఇచ్చింది. చచ్‌న్యా సంస్కృతిని కాపాడేందుకే ఇలా చేసిందట.
Similar News
News December 29, 2025
నెహ్రూ లేఖలను తిరిగి ఇచ్చేయండి: కేంద్రమంత్రి

జవహర్‌లాల్ నెహ్రూకు సంబంధించిన కీలక లేఖలు, పత్రాలు దేశ వారసత్వ సంపద అని కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ స్పష్టం చేశారు. వీటిని వెంటనే ‘ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీ’కి తిరిగి అప్పగించాలని సోనియా గాంధీని కోరారు. అవి కుటుంబ ఆస్తి కాదని.. దేశ చరిత్రను తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందన్నారు. 2008లో దాదాపు 26,000 పత్రాలను తీసుకెళ్లారని.. గతంలో పలుమార్లు కోరినా తిరిగి ఇవ్వలేదని గుర్తు చేశారు.
News December 29, 2025
‘ఆరావళి’పై రేపు సుప్రీంలో విచారణ

<<18663286>>ఆరావళి పర్వతాల<<>> నిర్వచనంపై చెలరేగిన వివాదాన్ని సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. CJI జస్టిస్ సూర్య కాంత్, జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ అగస్టిన్ జార్జి మాసిహ్‌తో కూడిన త్రిసభ్య ధర్మాసనం విచారించే అవకాశం ఉంది. ఆరావళి కొండలు, శ్రేణుల నిర్వచనం, అనుబంధ సమస్యల వివాదంపై ముఖ్యంగా విచారణ జరగనుంది. కాగా ఆరావళిలో మైనింగ్ <<18662201>>నిలిపివేస్తున్నట్లు<<>> కేంద్రం ఇప్పటికే ప్రకటించింది.
News December 28, 2025
భారత్ ఖాతాలో మరో విజయం

శ్రీలంక ఉమెన్స్‌తో జరుగుతున్న 5 T20ల సిరీస్‌లో భారత్ జైత్రయాత్ర కొనసాగుతోంది. తాజాగా జరిగిన 4వ T20లో IND 30 రన్స్ తేడాతో గెలిచింది. 222 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన SL 20 ఓవర్లలో 191/6 రన్స్‌కే పరిమితమైంది. ఓపెనర్లు ఆటపట్టు(52), పెరెరా(33) దూకుడుగా ఆడినా వారు ఔటయ్యాక రన్‌రేట్ పెరిగిపోవడంతో ఓటమిపాలైంది. IND బౌలర్లలో అరుంధతి, వైష్ణవి చెరో 2 వికెట్లు తీశారు. సిరీస్‌లో IND 4-0 లీడ్ సాధించింది.


