News April 9, 2024

అక్కడ మ్యూజిక్ స్పీడ్ పెరిగినా, తగ్గినా ఆర్టిస్టులకు బ్యాండే!

image

‘మరీ హై కాకుండా, మరీ లోగా కాకుండా మీడియంగా కొట్టరా’.. ఓ సినిమాలోని ఈ డైలాగ్‌ను రష్యన్ రిపబ్లిక్‌ ఆఫ్ చచ్‌న్యా సీరియస్‌గా తీసుకుందేమో! నిమిషానికి 80-116 బీట్లు ఉన్న టెంపోలనే పరిగణిస్తామని మ్యూజిక్‌పై ఆంక్షలు విధించింది అక్కడి ప్రభుత్వం. అంతకంటే స్లో లేదా స్పీడ్‌ ఉన్న మ్యూజిక్‌ను నిషేధిస్తూ, రీరైట్ చేసుకోవడానికి ఆర్టిస్టులకు JUN 1 వరకు గడువు ఇచ్చింది. చచ్‌న్యా సంస్కృతిని కాపాడేందుకే ఇలా చేసిందట.

Similar News

News March 18, 2025

మంచు లక్ష్మి, కాజల్‌, రానాపై కేసుకు డిమాండ్!

image

టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చొరవతో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తోన్న యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. నిన్న కూడా 11 మందిపై కేసు నమోదైంది. అయితే, మంచు లక్ష్మి సైతం బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారని విమర్శలొస్తున్నాయి. బెట్టింగ్ యాప్ యాడ్స్‌లో నటించిన రానా, కాజల్, ప్రకాశ్‌రాజ్‌లపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మీ కామెంట్?

News March 18, 2025

సెలబ్రిటీలపై కేసు.. పోలీసుల కీలక ఆదేశాలు

image

TG: సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్ ప్రమోషన్లపై పంజాగుట్ట పోలీసులు చర్యలు వేగవంతం చేశారు. నిన్న కేసు నమోదైన 11 మంది సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయెన్సర్లను ఇవాళ సాయంత్రంలోగా విచారణకు హాజరు కావాలని ఆదేశించారు. నోటీసులు ఇచ్చిన వారిలో విష్ణుప్రియ, సుప్రిత, రీతూ చౌదరి, హర్షసాయి, టేస్టీ తేజ, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్‌, శ్యామల, కిరణ్ గౌడ్‌, సన్నీ యాదవ్‌, సుధీర్ రాజు, అజయ్‌ ఉన్నారు.

News March 18, 2025

రేపు బిల్‌ గేట్స్‌తో చంద్రబాబు భేటీ

image

ఏపీ సీఎం చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4 గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ ఇంట్లో జరిగే వివాహ వేడుకకు హాజరుకానున్నారు. రేపు ఆయన మైక్రోసాఫ్ట్ కో-ఫౌండర్ బిల్‌గేట్స్‌తో భేటీ కానున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయ రంగాల్లో సహకారంపై చర్చించనున్నారు. పలు ఒప్పందాలు చేసుకునే అవకాశముంది. రేపు సాయంత్రం CBN తిరిగి అమరావతికి రానున్నారు. 20న అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొంటారు.

error: Content is protected !!