News April 10, 2024
ఆ వార్తను నమ్మొద్దు: పురందీశ్వరి
AP: ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఓ వార్త వైరల్ కావడంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి స్పందించారు. రిజర్వేషన్ల రద్దుపై తాను మాట్లాడినట్లు వస్తున్న కథనాలు ఫేక్ అన్నారు. ఆ వార్తను నమ్మొద్దని ఆమె కోరారు. సమాజంలోని అందరినీ కలుపుకొని అభివృద్ధి వైపు నడిపించడమే బీజేపీ అభిమతమన్నారు. తమకు వస్తున్న ప్రజాదరణను చూసి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News November 15, 2024
గుండెపోటు మరణాలు.. యువతలో ఆందోళన!
వయసుతో సంబంధం లేకుండా గుండెపోటు మరణాలు సంభవిస్తుండటం కలకలం రేపుతోంది. వయసు పైబడిన వారే కాకుండా పిల్లలు, యువత హార్ట్ ఎటాక్‌తో ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా తెలంగాణలోని జగిత్యాల(D) మోత్కూరావుపేటలో సంజీవ్ అనే యువకుడు పెళ్లి వేడుకలో డాన్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా మృతి చెందాడు.
News November 15, 2024
దేవతలు భూమ్మీదికి దిగొచ్చే ‘దేవ్ దీపావళి’ తెలుసా?
భక్తిశ్రద్ధలతో జరుపుకొనే కార్తీక పౌర్ణమినే ఉత్తరాదిలో దేవ్ దీపావళి అంటారు. వర గర్వంతో చావే రాదని విర్రవీగుతూ సజ్జనులను బాధిస్తున్న త్రిపురాసురులను ఆ పరమశివుడు సంహరించింది ఈరోజే. అందుకే ఆ విశ్వేశ్వరుడి దేహంలో ఒక భాగంగా భావించే కాశీ నగరంలో ఈ పండుగను అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈసారి గంగాతీరంలో 17లక్షల దీపాలను వెలిగిస్తున్నారు. ఈ వేడుకను వీక్షించేందుకు దేవతలు భూమికి దిగొస్తారని భక్తుల నమ్మిక.
News November 15, 2024
పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. పలువురి మృతి
పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్సులో నిన్న సాయంత్రం బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులు మృతిచెందారని, 14మంది తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. రసూల్ జాన్ అనే తాలిబాన్ ఉగ్రవాది తన ఇంటి వద్ద కారులో బాంబును బిగిస్తుండగా అది పేలిందని పేర్కొన్నారు. తాలిబాన్లు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాల్ని తరలించారని వెల్లడించారు.