News April 10, 2024
ఆ వార్తను నమ్మొద్దు: పురందీశ్వరి

AP: ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఓ వార్త వైరల్ కావడంపై బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి స్పందించారు. రిజర్వేషన్ల రద్దుపై తాను మాట్లాడినట్లు వస్తున్న కథనాలు ఫేక్ అన్నారు. ఆ వార్తను నమ్మొద్దని ఆమె కోరారు. సమాజంలోని అందరినీ కలుపుకొని అభివృద్ధి వైపు నడిపించడమే బీజేపీ అభిమతమన్నారు. తమకు వస్తున్న ప్రజాదరణను చూసి వైసీపీ పెయిడ్ ఆర్టిస్టులతో తప్పుడు ప్రచారం చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Similar News
News April 11, 2026
అల్లు అర్జున్ ‘రాకా’.. యాక్టర్ల రెమ్యునరేషన్ ఎంతంటే?

అట్లీ దర్శకత్వంలో ‘రాకా’ సినిమాలో నటించేందుకు అల్లు అర్జున్ రూ.175కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం. ఫీమేల్ లీడ్‌గా నటిస్తోన్న దీపికా పదుకొనె రూ.25కోట్లు, కీలక పాత్రలో నటిస్తోన్న రష్మిక రూ.5కోట్లు తీసుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాను రూ.700కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాగా ఇటీవల రిలీజ్ చేసిన అల్లు అర్జున్ లుక్ సినిమాపై అంచనాలను పెంచేసింది.
News April 11, 2026
బౌలర్ ఎవరనేది పట్టించుకోను: వైభవ్

తాను బాల్‌ను బట్టి షాట్లు ఆడతానని, బౌలర్ ఎవరనేది పట్టించుకోనని RR బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ తెలిపారు. RCBతో మ్యాచులో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నారు. బుమ్రా, హేజిల్‌వుడ్ లాంటి బౌలర్లను ఎదుర్కోవడం భయంగా ఉండదా అని అడగగా, మైండ్‌లో అది ఉంటుంది కానీ తాను బాల్‌ను మాత్రమే చూస్తానని చెప్పారు. బ్యాడ్ షాట్ ఆడి ఔటైతే బాధపడతానన్నారు.
* మ్యాచ్ ఫొటో గ్యాలరీని పైన స్లైడ్ చేసి చూడండి.