News April 10, 2024

వచ్చే 20 ఏళ్లలో IPL ట్రోఫీలు గెలిచే టీమ్స్ ఇవే?

image

చిలక జోస్యంతో పాటు స్వామీజీలు IPL మ్యాచ్‌ల గెలుపోటములను అంచనా వేస్తుండటం చూశాం. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే 20 IPL టోర్నమెంట్స్‌లో గెలిచే జట్టులను అంచనా వేసింది. AI ప్రెడిక్షన్ ప్రకారం ఈ ఏడాది IPL ట్రోఫీని గుజరాత్ టైటాన్స్ గెలుచుకుంటుంది. అలాగే 2025-CSK, 2026-MI, 2027-SRH, 2028-PBKS, 2029-RCB, 2030- DC, 2031-KKR, 2032-RR, 2033- LSG, 2034 ట్రోఫీ GT సొంతం అవుతుంది.

Similar News

News January 31, 2026

‘నో డ్యూ’తో మొండి బకాయిలు వసూలు!

image

TG: మున్సిపల్ ఎన్నికలతో ఇన్నాళ్ల మొండి బకాయిలు వసూలవుతున్నాయి. ఎలక్షన్స్‌లో పోటీ చేసే అభ్యర్థులకు ‘నో డ్యూ’ సర్టిఫికెట్ తప్పనిసరి కావడంతో వారంతా పెండింగ్ ట్యాక్స్ చెల్లిస్తున్నారు. నిజామాబాద్ 19వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి శమంతనరేందర్ తమ వంశీ హోటల్‌కు సంబంధించి ఏకంగా రూ.7.50కోట్ల ఆస్తిపన్ను కట్టారు. అన్ని మున్సిపాలిటీల్లో కలిపి రూ.50 కోట్లకు పైగా పన్నులు వసూలైనట్లు అధికారులు తెలిపారు.

News January 31, 2026

జుట్టు ఎందుకు రాలుతుందంటే?

image

మనిషి శరీరంలో ఉండే ఇమ్యూనిటీ సెల్ అలోప్సియా అరెటా జుట్టు రాలడానికి కారణమవుతుందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. కొరియా అడ్వాన్స్‌డ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పరిశోధకులు ఈ విషయాన్ని గుర్తించారు. అలోప్సియా అరెటా అనేది జుట్టుకు సంబంధించిన ఒక వ్యాధి. ఇది జుట్టు కుదుళ్లను బలహీనపరిచి జుట్టును ఎక్కువగా రాలిపోయేలా చేస్తుందని వారు తెలిపారు. ఇది ఇమ్యునిటీ తగ్గడం వల్ల కూడా జరుగుతుందని అన్నారు.

News January 31, 2026

T20 WC: ఫేక్ న్యూస్‌తో పాక్, బంగ్లా చీప్ ట్రిక్స్!

image

T20 వరల్డ్ కప్‌ను భారత్ హోస్ట్ చేస్తున్న వేళ పాక్, బంగ్లా కొత్త కుట్రకు తెరలేపాయి. ఇండియాలో <<19002211>>నిఫా<<>> వైరస్ విపరీతంగా వ్యాపిస్తోందంటూ SMలో ఫేక్ ప్రచారం చేస్తున్నాయి. ప్లేయర్స్ ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని, వరల్డ్ కప్ మ్యాచ్‌లను షిఫ్ట్ చేయాలంటూ పోస్ట్‌లు చేయిస్తున్నాయి. అయితే దేశంలో 2 కేసులు మాత్రమే నమోదయ్యాయని, దీనివల్ల ఎలాంటి రిస్క్ లేదని స్వయంగా WHOనే క్లారిటీ ఇచ్చింది.