News April 10, 2024
వచ్చే 20 ఏళ్లలో IPL ట్రోఫీలు గెలిచే టీమ్స్ ఇవే?

చిలక జోస్యంతో పాటు స్వామీజీలు IPL మ్యాచ్‌ల గెలుపోటములను అంచనా వేస్తుండటం చూశాం. అయితే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోయే 20 IPL టోర్నమెంట్స్‌లో గెలిచే జట్టులను అంచనా వేసింది. AI ప్రెడిక్షన్ ప్రకారం ఈ ఏడాది IPL ట్రోఫీని గుజరాత్ టైటాన్స్ గెలుచుకుంటుంది. అలాగే 2025-CSK, 2026-MI, 2027-SRH, 2028-PBKS, 2029-RCB, 2030- DC, 2031-KKR, 2032-RR, 2033- LSG, 2034 ట్రోఫీ GT సొంతం అవుతుంది.
Similar News
News January 19, 2026
మాఘ గుప్త నవరాత్రుల గురించి మీకు తెలుసా?

మాఘమాసంలో శుక్లపక్ష పాడ్యమి నుంచి నవమి వరకు 9 రోజులను ‘మాఘ గుప్త నవరాత్రులు’ అంటారు. అయితే, ఇవి రహస్యంగా (గుప్తంగా) అమ్మవారిని ఉపాసించేవి. అందుకే వీటికి ఈ పేరు వచ్చింది. ఈ సమయంలో శక్తి స్వరూపిణి అయిన వారాహి దేవిని, దశమహావిద్యలను భక్తులు విశేషంగా ఆరాధిస్తారు. ముఖ్యంగా సాధకులు ఆధ్యాత్మిక శక్తి కోసం, ఆటంకాలు తొలగి కార్యసిద్ధి కలగడం కోసం ఈ నవరాత్రులలో కఠిన నియమాలతో పూజలు నిర్వహిస్తారు.
News January 19, 2026
రాష్ట్రంలో 140 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ హార్టికల్చర్ యూనివర్సిటీలో 140 పోస్టులకు అప్లై చేయడానికి జనవరి 31 ఆఖరు తేదీ. మొత్తం పోస్టుల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ 79, అసోసియేట్ ప్రొఫెసర్ 44, ప్రొఫెసర్ 17 ఉన్నాయి. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో మాస్టర్ డిగ్రీ, PhDతో పాటు బోధన, రీసెర్చ్ అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. వెబ్‌సైట్: https://skltghu.ac.in/
News January 19, 2026
ఎన్నికల నగారా.. ఫిబ్రవరి 14న పోలింగ్?

TG: మున్సిపల్ ఎన్నికలకు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ నెల 21న షెడ్యూల్, ఫిబ్రవరి 14న పోలింగ్ నిర్వహించేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అటు అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటుపై పార్టీలు తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు నేతలు వ్యూహాలు పన్నుతున్నారు. మరి ‘ప్రేమికుల రోజు’ ఓటర్లు ఎవరిపై ప్రేమ కురిపిస్తారో చూడాలి.


