News April 10, 2024
దానం నాగేందర్‌పై హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్

TG: దానం నాగేందర్ అనర్హత పిటిషన్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానంపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరింది. దీనిపై స్పీకర్ ఇంకా స్పందించడం లేదని.. త్వరగా చర్యలు తీసుకునేలా సభాపతిని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించనుంది.
Similar News
News March 25, 2026
ఓటీటీలోకి అవతార్ 3.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

హాలీవుడ్ దిగ్గజం జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన అవతార్ 3 మూవీ OTT రిలీజ్ ఖరారైంది. ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, యాపిల్ టీవీలో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది. హాట్‌స్టార్‌లో ఏప్రిల్ లేదా మే నెలలో భారతీయ భాషల్లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. గతేడాది డిసెంబర్‌లో రిలీజైన ఈ మూవీకి మిక్స్‌డ్ రివ్యూస్ రాగా, ప్రపంచవ్యాప్తంగా రూ.13 వేల కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది.
News March 25, 2026
నిరుద్యోగులుగా గ్రాడ్యుయేట్లు.. స్కిల్స్ పెంచుకోండి!

ఇండియాలో డిగ్రీ ఉన్నా ఉద్యోగం దొరకడం సవాలుగా మారింది. అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ రిపోర్ట్ 2026’ ప్రకారం 20-24ఏళ్ల గ్రాడ్యుయేట్లలో 39%, 25-29ఏళ్ల వారిలో 20శాతం నిరుద్యోగులు ఉన్నారు. అయితే ప్రస్తుత మార్కెట్ అవసరాలకు తగ్గట్టుగా స్కిల్స్ పెంచుకుంటే ఈ సంక్షోభాన్ని అధిగమించవచ్చంటున్నారు నిపుణులు. టెక్నికల్ నాలెడ్జ్, కమ్యూనికేషన్ స్కిల్స్ తోడైతే అవకాశాలు వాటంతట అవే వస్తాయంటున్నారు.
News March 25, 2026
సిద్దిపేటలో పోటీకి ఎవరో ఎందుకు రేవంతే రావచ్చు: హరీశ్ సవాల్

TG: తలకిందులుగా తపస్సు చేసినా రేవంత్ మళ్లీ CM కాలేడని BRS నేత హరీశ్ విమర్శించారు. ‘ఏ టైమ్‌లో గోల్ కొట్టాలో మాకు బాగా తెలుసు. వచ్చే ఎన్నికల్లో గోల్ కొట్టేది మేమే. ఎలక్షన్ ఎప్పుడొచ్చినా BRSదే గెలుపు. KCR CM. సిద్దిపేటలో పోటీకి ఎవరినో పెట్టడం ఎందుకు రేవంత్ రెడ్డే రావచ్చు’ అని సవాల్ విసిరారు. అసెంబ్లీ నిర్వహణలో GOVT విఫలమైందని, ప్రజాసమస్యలపై చర్చే లేదని మీడియాతో చిట్ చాట్‌లో విమర్శించారు.


