News April 10, 2024
దానం నాగేందర్‌పై హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్

TG: దానం నాగేందర్ అనర్హత పిటిషన్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానంపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరింది. దీనిపై స్పీకర్ ఇంకా స్పందించడం లేదని.. త్వరగా చర్యలు తీసుకునేలా సభాపతిని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించనుంది.
Similar News
News March 23, 2025
కోహ్లీ ఖాతాలో మరో రికార్డు

టీ20 ఫార్మాట్‌లో 400 మ్యాచులు ఆడిన మూడో భారత ప్లేయర్‌గా విరాట్ కోహ్లీ రికార్డు సృష్టించారు. KKRతో జరిగిన మ్యాచుతో ఈ ఘనత అందుకున్నారు. అతనికంటే ముందు రోహిత్ శర్మ(448), దినేశ్ కార్తీక్ (412) ఈ ఫీట్ సాధించారు. కాగా టీ20ల్లో అత్యధిక రన్స్ చేసిన లిస్టులో కోహ్లీ (12,945) ఐదో స్థానంలో ఉన్నారు. గేల్ (14,562), హేల్స్ (13,610), షోయబ్ (13,537), పొలార్డ్ (13,537) తొలి 4 స్థానాల్లో కొనసాగుతున్నారు.
News March 23, 2025
ప్రజలు కాదు.. పొలిటీషియన్లే కులతత్వవాదులు: గడ్కరీ

ప్రజలు కులతత్వవాదులు కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం వారి స్వార్థ ప్రయోజనాల కోసం కులాల గురించి మాట్లాడతారని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వెనుకబాటుతనం కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్‌గా మారుతోందని, ఎవరు ఎక్కువ వెనుకబడి ఉన్నారనే దానిపైనా పోటీ ఉందని గడ్కరీ పేర్కొన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని, కుల వివక్ష అంతం కావాలని అన్నారు.
News March 23, 2025
CUET UG దరఖాస్తు గడువు పెంపు

కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్-అండర్ గ్రాడ్యుయేట్ (CUET UG) దరఖాస్తు గడువును NTA పొడిగించింది. ఈనెల 24 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది. మార్చి 26 నుంచి 28వ తేదీ వరకు దరఖాస్తులను సవరించుకోవచ్చు. మే 8 నుంచి జూన్ 1 వరకు పరీక్షలు జరగనున్నాయి. సెంట్రల్, స్టేట్, ప్రైవేట్ వర్సిటీల్లో UG కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను CBT విధానంలో 13 భాషల్లో నిర్వహించనున్నారు.