News April 10, 2024

జనంతో చార్మినార్ మార్కెట్ల కళకళ

image

ఈరోజు చందమామ కనిపించడంతో రేపు దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్‌ను జరుపుకోనున్నారు. ఈక్రమంలో హైదరాబాద్‌లోని చార్మినార్ మార్కెట్లు జనంతో నిండిపోయాయి. గాజులు, అత్తర్లు సహా మహిళలు ఇష్టంగా కొనుగోలు చేసే పలు రకాలైన అలంకరణ వస్తువులు, దుస్తులు అక్కడ లభిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంజాన్ మాసంలో కులమతాలకు అతీతంగా అక్కడ జనం షాపింగ్‌ చేస్తుంటారు.

Similar News

News November 15, 2024

ప్ర‌ధాని మోదీ విమానంలో సాంకేతిక లోపం

image

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ప్ర‌యాణించాల్సిన ఎయిర్‌క్రాఫ్ట్‌లో సాంకేతిక లోపం తలెత్తిన‌ట్టు తెలుస్తోంది. మోదీ శుక్రవారం ఝార్ఖండ్ పర్యటన ముగించుకొని ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవ్వాల్సి ఉంది. ఈ క్రమంలో దేవ్‌ఘర్ విమానాశ్ర‌యంలో ఉన్న విమానంలో సమస్య తలెత్తినట్టు జాతీయ మీడియాలో క‌థ‌నాలు వ‌స్తున్నాయి. దీనిపై PM Office స్పందించాల్సి ఉంది. మోదీ తిరుగు ప్ర‌యాణం మ‌రింత ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశం ఉన్న‌ట్టు స‌మాచారం.

News November 15, 2024

OTD: సచిన్ అరంగేట్రానికి సరిగ్గా 35 ఏళ్లు

image

భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి నేటికి సరిగ్గా 35 ఏళ్లు అవుతోంది. 1989 నవంబర్ 15న పాకిస్థాన్‌పై 16 ఏళ్ల వయసులోనే ఎంట్రీ ఇచ్చారు. తొలి మ్యాచ్‌లో డకౌటైనా ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. 200కుపైగా టెస్టులు, 400కుపైగా వన్డేలు ఆడి శత శతకాలు బాదారు. ఎవరికీ సాధ్యం కాని రీతిలో అంతర్జాతీయ క్రికెట్‌లో 34,357 పరుగులు చేశారు. 2013లో ఇదే తేదీన చివరిసారిగా బ్యాటింగ్‌కు దిగారు.

News November 15, 2024

గుజరాత్‌లో 500 కేజీల డ్ర‌గ్స్ ప‌ట్టివేత‌

image

గుజ‌రాత్‌ పోర్‌బంద‌ర్‌లో స‌ముద్ర మార్గంలో అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న 500 KGల డ్ర‌గ్స్‌ను అధికారులు ప‌ట్టుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో సంయుక్తంగా జరిపిన ఆపరేషన్‌లో ఈ భారీ డ్ర‌గ్స్ రాకెట్ గుట్టుర‌ట్టైంది. ఇరాన్ దేశానికి చెందిన బోటులో డ్ర‌గ్స్ తెచ్చిన‌ట్టు అధికారులు గుర్తించారు. సరిహద్దు జలాల్లో నేవీ సాయంతో న‌డిసంద్రంలో ఈ ఆపరేషన్ చేపట్టారు.