News April 10, 2024
జనంతో చార్మినార్ మార్కెట్ల కళకళ

ఈరోజు చందమామ కనిపించడంతో రేపు దేశవ్యాప్తంగా ముస్లింలు ఈద్‌ను జరుపుకోనున్నారు. ఈక్రమంలో హైదరాబాద్‌లోని చార్మినార్ మార్కెట్లు జనంతో నిండిపోయాయి. గాజులు, అత్తర్లు సహా మహిళలు ఇష్టంగా కొనుగోలు చేసే పలు రకాలైన అలంకరణ వస్తువులు, దుస్తులు అక్కడ లభిస్తాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రంజాన్ మాసంలో కులమతాలకు అతీతంగా అక్కడ జనం షాపింగ్ చేస్తుంటారు.
Similar News
News March 27, 2025
సోషల్ మీడియాలో నటి ప్రైవేటు వీడియో లీక్

తమిళ నటికి చెందిన ఓ ప్రైవేట్ వీడియో X, ఇన్‌స్టా, టెలిగ్రామ్‌లో ప్రత్యక్షం కావడం తీవ్ర కలకలం రేపింది. 14 నిమిషాల నిడివి గల ఆ వీడియో క్యాస్టింగ్ కౌచ్ ఉదంతానికి నిదర్శనమని సినీ అభిమానులు ఫైర్ అవుతున్నారు. దీంతో ట్విటర్‌లో ఆమె పేరు ట్రెండ్ అవుతోంది. మరోవైపు వీడియో ఆ నటిది కాదని, ఆమె ముఖాన్ని ఎడిట్ చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. నటికి ఇన్‌స్టాలో 420K ఫాలోవర్లున్నారు.
News March 27, 2025
బ్రేక్‌ఫాస్ట్‌లో ఇవి తినండి

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో పోషకాహారం తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ఆరోగ్యాన్ని దెబ్బతీసే అల్పాహారం తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు. అధిక ప్రొటీన్ ఉండే చిరుధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తినాలి. రాగి, సామలు, కొర్రలతో చేసిన ఇడ్లీలు, దోశలు తింటే లాభాలు ఉన్నాయి. ఇవి తింటే గ్యాస్ సమస్యలు తగ్గుతాయి. షుగర్, ఊబకాయం, రక్తహీనత, గుండె జబ్బుల నివారణకు ఇవి మంచి ఆహారం. అధిక ఆకలి సమస్యనూ అధిగమించవచ్చు.
News March 27, 2025
శ్రేయస్ అయ్యర్‌కు బీసీసీఐ బంపరాఫర్?

ఈ నెల 29న గువాహటిలో బీసీసీఐ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ తదితరులు భేటీ కానున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టులు, సిబ్బంది నియామకం వంటి అంశాలపై చర్చిస్తారని టాక్. కాగా టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్‌ను తిరిగి సెంట్రల్ కాంట్రాక్టులోకి తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి.