News April 11, 2024

లక్షన్నర మెజార్టీతో గెలుస్తా : మాధవీలత

image

TG: హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంఐఎంకు మద్దతుగా నిలుస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికే వ్యతిరేకమని దుయ్యబట్టారు. రజాకార్లకు తోడుగా ఉండే వారంతా తన ప్రత్యర్థులేనన్నారు. రాబోయే ఎన్నికల్లో తనదే విజయమని.. ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌పై లక్షన్నర ఓట్ల మెజార్టీతో గెలుస్తానని జోస్యం చెప్పారు.

Similar News

News January 1, 2026

పాలు పితికేటప్పుడు ఈ తప్పు చేయొద్దు

image

కొందరు పాడి రైతులు పశువు నుంచి పాలను సేకరించేటప్పుడు పొదుగు నుంచి పూర్తిగా పాలను తీయకుండా కొన్నింటిని వదిలేస్తారు. ఇలా పొదుగులో మిగిలిపోయిన పాలలోకి బాక్టీరియా చేరి పొదుగువాపు వ్యాధికి కారణమవుతుందని వెటర్నరీ నిపుణులు చెబుతున్నారు. అలాగే పొదుగుకు అయ్యే చిన్న గాయాలకు చికిత్స అందించకుండా నిర్లక్ష్యం చేస్తే, ఇన్ఫెక్షన్ నెమ్మదిగా పొదుగులోకి వ్యాపించి పొదుగువాపు వ్యాధి వచ్చే అవకాశం ఉంది.

News January 1, 2026

హరిహరులను కొలిచేందుకు నేడే సరైన సమయం

image

నేడు హరిహరులను కలిపి పూజిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘గురువారం విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరం. అలాగే ఈరోజు త్రయోదశి తిథి. ప్రదోష వ్రతం కూడా నిర్వహిస్తారు. శివారాధనకు ఇది అత్యంత అనుకూలమైన సమయం. ఒకే రోజున అటు హరి, ఇటు హర.. ఇద్దరినీ పూజించే అరుదైన అవకాశం కలిగింది. భక్తులు ఈ శుభదినాన విష్ణు సహస్రనామ పారాయణతో పాటు శివాభిషేకం చేయడం అభీష్ట సిద్ధి పొందుతారు’ అని అంటున్నారు.

News January 1, 2026

జోగి రమేశ్‌కు రూ.కోటి ముడుపులు?

image

AP: నకిలీ మద్యం కేసులో జోగి రమేశ్ సోదరులపై సప్లిమెంటరీ-2 ఛార్జ్‌షీటును సిట్ దాఖలు చేసింది. ప్రధాన నిందితుడు అద్దేపల్లి జనార్దనరావు ₹కోటికిపైగా ముడుపులు రమేశ్‌కు ఇచ్చారని సిట్ పేర్కొన్నట్లు తెలిసింది. 2021-23 మధ్య పలు విడతల్లో ఇచ్చారని సమాచారం. అద్దేపల్లి సోదరులు, రమేశ్ మధ్య 7వేల ఫోన్ కాల్స్ నమోదైనట్లు తెలుస్తోంది. ఈ కేసులో 17 మంది నిందితులకు విజయవాడ కోర్టు ఈ నెల 12 వరకు రిమాండ్ పొడిగించింది.