News April 11, 2024
మూడు నెలల్లో 3 గాయాల నుంచి కోలుకున్నా: సూర్యకుమార్

మూడు నెలల్లో 3 గాయాలతో పోరాడినట్లు ముంబై ఇండియన్స్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. స్పోర్ట్స్ హెర్నియా, చీలమండ, కుడి మోకాలికి గాయాలైనట్లు తెలిపారు. ఒక్కో గాయం నుంచి బయటపడినట్లు పేర్కొన్నారు. ఎన్సీఏలో ఉదయాన్నే నిద్రలేచి కసరత్తులు చేయడం, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడ్డాయన్నారు. ఢిల్లీతో మ్యాచులో ఎంట్రీ ఇచ్చిన సూర్య డకౌటైన సంగతి తెలిసిందే.
Similar News
News December 28, 2025
31న డెలివరీ బాయ్స్ సమ్మె.. డిమాండ్స్ ఇవే!

గిగ్ వర్కర్లు ఈ నెల 31న దేశవ్యాప్తంగా <<18668798>>సమ్మెకు<<>> సిద్ధమవుతున్నారు. స్విగ్గీ, జొమాటో, జెప్టో, బ్లింకిట్, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ యాప్స్ డెలివరీ బాయ్స్ సర్వీసులు ఆపేయనున్నారు. వారి డిమాండ్స్ ఇవే.. పారదర్శక, న్యాయమైన వేతన చెల్లింపులు. *10 నిమిషాల డెలివరీ మోడల్‌ను విత్ డ్రా చేసుకోవాలి. *సరైన ప్రాసెస్ లేకుండా అకౌంట్ బ్లాక్ చేయడం ఆపేయాలి. *మెరుగైన ప్రమాద బీమా కల్పించాలి. *హామీ ఇచ్చిన మేరకు పని కేటాయించాలి.
News December 28, 2025
గ్లిజరిన్‌తో చర్మానికి ఆరోగ్యం

గ్లిజరిన్ ఒక హ్యుమెక్టెంట్ అంటే ఇది చర్మం నుంచి తేమను లాగకుండా నిరోధిస్తుంది. లోపలి నుంచి తేమను నిలుపుకుంటుంది. పొడి చర్మతత్వం ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. చర్మ ఎలాస్టిసిటీని పెంచి ముడతలు రాకుండా చూస్తుంది. గ్లిజరిన్‌లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి. దీన్ని నేరుగానూ లేదా ఇతర ఉత్పత్తుల్లో కలిపీ వాడొచ్చంటున్నారు.
News December 28, 2025
ఎల్లుండే ముక్కోటి ఏకాదశి! ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తున్నారా?

డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి. ఆ రోజు వైష్ణవాలయాలు వైకుంఠ ధామాలుగా మారుతాయి. అదే రోజున మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తారని ప్రతీతి. ఈ సందర్భంగా ఉదయం నుంచే ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర దినాన మీరు ఏ ఆలయానికి వెళ్తున్నారు? COMMENT! మరింత సమాచారం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.


