News April 11, 2024

మూడు నెలల్లో 3 గాయాల నుంచి కోలుకున్నా: సూర్యకుమార్

image

మూడు నెలల్లో 3 గాయాలతో పోరాడినట్లు ముంబై ఇండియన్స్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ తెలిపారు. స్పోర్ట్స్ హెర్నియా, చీలమండ, కుడి మోకాలికి గాయాలైనట్లు తెలిపారు. ఒక్కో గాయం నుంచి బయటపడినట్లు పేర్కొన్నారు. ఎన్‌సీఏలో ఉదయాన్నే నిద్రలేచి కసరత్తులు చేయడం, సరైన సమయానికి ఆహారం తీసుకోవడం వేగంగా కోలుకునేందుకు ఉపయోగపడ్డాయన్నారు. ఢిల్లీతో మ్యాచులో ఎంట్రీ ఇచ్చిన సూర్య డకౌటైన సంగతి తెలిసిందే.

Similar News

News February 11, 2026

‘టాయ్‌లెట్ పేపర్ కన్నా దారుణంగా’.. అమెరికాపై పాక్ మంత్రి ఫైర్

image

అమెరికా తన వ్యూహాత్మక ప్రయోజనాల కోసం పాక్‌ను పావుగా వాడుకుంటోందని ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ మండిపడ్డారు. టాయ్‌లెట్ పేపర్ కన్నా దారుణంగా వాడుకుని వదిలేసిందని ఆరోపించారు. 1999 తర్వాత US మద్దతు కోసం అఫ్గాన్ యుద్ధంలోకి దిగడం తమకు తీరని నష్టం కలిగించిందని వాపోయారు. దశాబ్దాల తర్వాత కూడా పర్యవసానాలు అనుభవిస్తున్నామన్నారు. జిహాద్ పేరుతో తమ పౌరులను పోరాటానికి పంపామని పార్లమెంటులో అంగీకరించారు.

News February 11, 2026

టెట్ రిజల్ట్స్.. 42% టీచర్లు అనర్హులే!

image

TG: నిన్న విడుదలైన టెట్ <<19104650>>ఫలితాల్లో<<>> ఏకంగా 27,712(42%) మంది ఇన్ సర్వీస్ టీచర్లు అర్హత సాధించలేదు. మొత్తం 65,605 మంది టీచర్లు పరీక్షకు హాజరయ్యారు. టెట్ ప్రవేశ పెట్టకముందు నియమితులై ఐదేళ్లకు మించి సర్వీసులో ఉన్న టీచర్లు రెండేళ్లలోపు ఒక్కసారైనా టెట్ ఉత్తీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇక ఓవరాల్‌గా 1,95,181 మంది పరీక్ష రాయగా 1,00,270 మంది(51.37%) క్వాలిఫై అయ్యారు.

News February 11, 2026

గర్భంతో ఉన్నప్పుడు ఇద్దరి కోసం తినాలా?

image

చాలామంది పెద్దవాళ్లు గర్భవతి ఇద్దరి కోసం తినాలంటూ ఒత్తిడి చేస్తుంటారు. కానీ అది సరికాదంటున్నారు నిపుణులు. గర్భవతులు తమ బరువు పెరుగుదలను ఆరోగ్యకరమైన పరిమితిలో ఉంచుకోవడానికి తక్కువ మోతాదుల్లో ఎక్కువసార్లు తినడం మంచిది. అన్ని పోషకాలు ఉండే సమతులాహారం తీసుకోవాలి. అలాగే కొందరు ప్రెగ్నెన్సీలో అసలు బరువే పెరగకపోవచ్చు. అది వారి శరీరతత్వంపై ఆధారపడి ఉంటుంది. దీనివల్ల ప్రెగ్నెన్సీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు.