News November 8, 2025

ఖమ్మం డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఇన్‌ఛార్జి హల్చల్

image

ఖమ్మం జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి కార్యాలయంలో ఇన్‌ఛార్జి అధికారి హడావుడి కలకలం రేపింది. సెలవులో ఉన్న రెగ్యులర్ డీఎంహెచ్‌ఓ పేరుతోనే ఆయన ఉత్తర్వులు జారీ చేయడం తీవ్ర చర్చకు దారితీసింది. ‘నేనే డీఎంహెచ్‌ఓ’ అంటూ సిబ్బందితో చెప్పడం, ప్రైవేటు ఆస్పత్రుల తనిఖీ కమిటీలో తన అనుచరులకే చోటు కల్పిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వివాదాస్పద తీరుపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.

Similar News

News March 24, 2026

అంగన్వాడీల పనితీరు మెరుగుపడాలి: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం జరిగిన సమీక్షలో కలెక్టర్ అనుదీప్ అంగన్వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపరచాలని ఆదేశించారు. పిల్లల హాజరు తక్కువగా ఉండటంపై కారణాలు తెలుసుకొని చర్యలు తీసుకోవాలని సూచించారు. సీడీపీవోలు క్షేత్రస్థాయిలో తనిఖీలు పెంచాలని, సామ్, మ్యామ్ పిల్లలకు ఆర్‌బీఎస్‌కే వైద్యులతో పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. పోషకాహారం, సౌకర్యాలు మెరుగుపరచి హాజరు పెంచాలని అధికారులకు సూచించారు.

News March 24, 2026

అట్రాసిటీ, పీసీఆర్ చట్టాలను కట్టుదిట్టం చేయాలి: కలెక్టర్

image

ఖమ్మం కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన జిల్లా స్థాయి విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ అనుదీప్ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, పీసీఆర్ చట్టాలను కట్టుదిట్టంగా అమలు చేయాలని ఆదేశించారు. పౌర హక్కులపై ప్రతి నెల అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పింఛన్లు, ఉపాధి, శ్మశాన వాటిక అభివృద్ధి సమస్యలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వ పథకాలలో ప్రాధాన్యత కల్పించాలన్నారు.

News March 24, 2026

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడమే లక్ష్యం: ఖమ్మం సీపీ

image

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొట్టడం, డ్రగ్స్ బారిన పడిన వారికి విముక్తి కలిగించడమే లక్ష్యమని సీపీ సునీల్ దత్ అన్నారు. పోలీస్ శాఖ, ఈగల్ ఫోర్స్ ఎస్పీ గిరిధర్ రావు, డీఎఫ్‌వో సిద్ధార్థ్ విక్రమ్ సింగ్ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం గాంధీచౌక్‌లో స్థానిక ప్రజలకు యాంటీ డ్రగ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల రవాణా, వినియోగాన్ని నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.