News April 11, 2024

రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్

image

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్‌కి గౌరవ డాక్టరేట్ దక్కనుంది. చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా చరణ్ పాల్గొననున్నారు. కళా రంగానికి రామ్ చరణ్ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ ఇస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Similar News

News September 17, 2025

ఒత్తైన జుట్టుకు బియ్యం నీళ్లు

image

ప్రస్తుత కాలంలో జుట్టు రాలే సమస్య పెరిగింది. అయితే హెయిర్‌లాస్ ఎక్కువ ఉంటే బియ్యం కడిగిన నీళ్లతో చెక్ పెట్టొచ్చు. బియ్యం నీటితో మర్దనా చేసుకుంటే మాడు ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో ఉండే అమినో ఆమ్లాలు, విటమిన్‌ బీ, ఈ, సీలు జుట్టు పెరగడానికి సహకరిస్తాయి. అలాగే రాత్రి బియ్యం నానబెట్టిన నీటిని వడకట్టి ఉదయాన్నే తలకు పట్టించి అరగంట తర్వాత కడుక్కోవాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది.

News September 17, 2025

అత్యధిక రెమ్యునరేషన్ ఈ హీరోయిన్లకే!

image

దక్షిణాదిన అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్ల వివరాలను ఇండియా టుడే తెలిపింది. నయనతార ఒక్కో సినిమాకు రూ.10+ కోట్లు తీసుకుంటారని పేర్కొంది. అలాగే సాయిపల్లవికి మూవీని బట్టి ₹20కోట్ల వరకు ఉంటుందని, ‘రామాయణ’ కోసం రూ.12కోట్లు డిమాండ్ చేశారంది. నేషనల్ క్రష్ రష్మిక ‘సికందర్‌’కి ₹13Cr, పుష్ప-2కి ₹10Cr కోట్లు తీసుకున్నారంది. ఇక తమన్న ప్రతి సినిమాకు ₹10కోట్లు వసూల్ చేస్తున్నారని తెలిపింది.

News September 17, 2025

వ్యవసాయం.. అంతర పంటలతో అధిక లాభం

image

ప్రధాన పంట వరుసల మధ్య ఉన్న ఖాళీ స్థలం వృథా కాకుండా పండించే మరో పంటను అంతర పంట అంటారు. ఈ విధానంలో ఒక పంట దెబ్బతిన్నా.. మరొకటి చేతికొస్తుంది. వాతావరణం అనుకూలిస్తే 2 పంటల నుంచి రైతు మంచి ఆదాయం పొందవచ్చు. దీని వల్ల పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. కీటకాలు, తెగుళ్లు, కలుపు మొక్కల బెడద, నేలకోత తగ్గి.. భూమిలో పోషకాలు పెరిగే అవకాశం ఉంది. అంతర పంటల సాగు వల్ల వచ్చిన ఆదాయం ప్రధాన పంట పెట్టుబడికి సహాయపడుతుంది.