News April 11, 2024
రామ్‌చరణ్‌కు గౌరవ డాక్టరేట్

ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రామ్‌చరణ్‌కి గౌరవ డాక్టరేట్ దక్కనుంది. చెన్నైకి చెందిన వేల్స్ విశ్వవిద్యాలయం ఆయనకు డాక్టరేట్ ప్రకటించింది. ఏప్రిల్ 13న యూనివర్సిటీ స్నాతకోత్సవంలో ముఖ్యఅతిథిగా చరణ్ పాల్గొననున్నారు. కళా రంగానికి రామ్ చరణ్ చేస్తున్న సేవలను గుర్తించి డాక్టరేట్ ఇస్తున్నట్లు వర్సిటీ ప్రకటించింది. దీనిపై అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News December 7, 2025
సంకటహర చతుర్థి ప్రత్యేకత ఏంటంటే?

ఇవాళ వినాయకుడిని పూజిస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ‘ఇవాళ సాయంత్రం 6.25 గంటలకు చతుర్థి ప్రారంభమయ్యి సోమవారం సాయంత్రం 4.03 గంటలకు ముగుస్తుంది. ఈరోజు వినాయకుడిని గరికతో పూజించడం విశేషం. చంద్ర దర్శనం తర్వాత వినాయక పూజ చేసుకోవడం శుభప్రదం. సంకటహర చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిథిరోజు 3, 5, 11, 21 నెలలపాటు ఆచరించాలి. దీనిని బహుళ చవితి రోజు ప్రారంభించాలి’ అని పండితులు చెబుతున్నారు.
News December 7, 2025
ఈ ఆలయాలకు వెళ్తే..

మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ శని దోష నివారణకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఊర్లో ఇళ్లు, షాపులకు తలుపులు ఉండవు. న్యాయాధిపతి శని దేవుడి మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని నమ్ముతారు. శని దోషం ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. శని ధామ్(ఢిల్లీ), కోకిలవ ధామ్(UP), తిరునల్లార్(తమిళనాడు) ఆలయాలను దర్శించడం వల్ల కూడా శని గ్రహ ప్రభావం తగ్గుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News December 7, 2025
కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్: స్టెయిన్

టీమ్ ఇండియాపై వన్డే సిరీస్ కోల్పోవడం కాస్త నిరుత్సాహ పరిచిందని SA మాజీ పేసర్ డేల్ స్టెయిన్ పేర్కొన్నారు. ‘ఇది ఒక బ్యాడ్ డే. సిరీస్ డిసైడర్‌లో తప్పులకు తావుండకూడదు. టీమ్ ఇండియాకి శుభాకాంక్షలు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ(65*) అద్భుతంగా బ్యాటింగ్ చేశావ్. నేను 20-20 మ్యాచుల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’ అని ట్వీట్ చేశారు. IND-SA మధ్య 5 టీ20ల సిరీస్ డిసెంబర్ 9 నుంచి కటక్ వేదికగా ప్రారంభంకానుంది.


