News April 11, 2024

APPLY NOW.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

image

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 966 పోస్టులున్నాయి. ఇంజినీరింగ్/ సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 18లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. జూన్ 4వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. వేతనం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. వెబ్‌సైట్: https://ssc.gov.in

Similar News

News January 21, 2026

ఆ ఉద్యోగుల శాలరీలు నేరుగా ఖాతాల్లోకి!

image

TG: కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో IFMIS విధానంలో నేరుగా ఖాతాల్లోకి జీతాలు చెల్లించేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీంతో హెచ్‌వోడీ, ఏజెన్సీల అకౌంట్లు వంటి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. ఇది April నుంచి అమలయ్యేలా ఉద్యోగుల వివరాలను డిజిటలైజేషన్ చేస్తోంది. కాగా రాష్ట్రంలో దాదాపు 5 లక్షల కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు.

News January 21, 2026

SHOCKING: ఒకే రోజు రూ.5వేలు పెరిగిన బంగారం ధర

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.5,020 పెరిగి రూ.1,54,800కు చేరింది. అలాగే 22క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.4,600 ఎగబాకి రూ.1,41,900 పలుకుతోంది. అటు సిల్వర్ ధరల్లో ఎలాంటి మార్పులేదు. కేజీ వెండి ధర రూ.3,40,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో ధరల్లో స్వల్ప తేడాలున్నాయి.

News January 21, 2026

చీనీ, నిమ్మలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా?

image

చీనీ, నిమ్మ తోటల్లో ఆకు, కాయ మచ్చ తెగులు (ఆల్టర్నేరియా) కనపడుతోంది. ఇది సోకితే ఆకులపై మచ్చల చుట్టూ పసుపు రంగు వలయం, కాయలపై ముదురు గోధుమ, నలుపు రంగులో మచ్చలు ఏర్పడతాయి. దీనివల్ల పంట దిగుబడి తగ్గిపోతుంది. నివారణకు 2 గ్రా. క్లోరోథలోనిల్, 1ML అజాక్సీస్ట్రోబిన్, 1ML ప్రొపికొనజోల్ మందులను లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఎండిన కొమ్మలు, తెగులు సోకిన ఆకులు, కాయలను ఏరివేసి నాశనం చేయాలి.