News April 11, 2024
APPLY NOW.. భారీ జీతంతో ప్రభుత్వ ఉద్యోగాలు

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసిన జూనియర్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో మొత్తం 966 పోస్టులున్నాయి. ఇంజినీరింగ్/ సంబంధిత విభాగంలో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఏప్రిల్ 18లోపు ఆన్‌లైన్‌లో అప్లై చేసుకోవాలి. జూన్ 4వ తేదీన ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహిస్తారు. వేతనం రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు ఉంటుంది. వెబ్‌సైట్: https://ssc.gov.in
Similar News
News March 23, 2025
నరైన్ ‘హిట్ వికెట్’.. ఎందుకు ఔట్ ఇవ్వలేదంటే?

నిన్న RCBతో మ్యాచ్‌లో KKR బ్యాటర్ సునీల్ నరైన్ ‘హిట్ వికెట్’పై చర్చ జరుగుతోంది. MCC నిబంధనల ప్రకారం బ్యాటర్ బంతిని ఆడేటప్పుడు లేదా పరుగు తీసే క్రమంలో బ్యాట్ వికెట్లను తాకితేనే హిట్ వికెట్‌గా పరిగణిస్తారు. అయితే నిన్న బంతి నరైన్ పైనుంచి వెళ్లి కీపర్ చేతిలో పడ్డ తర్వాత బ్యాట్ వికెట్లను తాకింది. అప్పటికే అంపైర్ బంతిని వైడ్‌గా ప్రకటించారు. అందుకే దాన్ని నరైన్‌ను నాటౌట్‌గా ప్రకటించారు.
News March 23, 2025
బంగ్లాలో హిందువులపై ప్రణాళిక ప్రకారమే హింస: RSS

బంగ్లాలో హిందువులపై మానవహక్కుల ఉల్లంఘన జరుగుతోందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(RSS) ఆందోళన వ్యక్తం చేసింది. అఖిల భారతీయ ప్రతినిధి సభ(ABPS)లో ఈ మేరకు తీర్మానాన్ని ఆమోదించింది. ‘బంగ్లాలో హిందువులపై ప్రణాళికాబద్ధంగా హింసకు పాల్పడుతున్నారు. మైనారిటీలను అణచివేసే ప్రయత్నం జరుగుతోంది. ఇస్లామిస్ట్ శక్తుల చేతిలో మైనారిటీలు నరకాన్ని చూస్తున్నారు’ అని అందులో పేర్కొంది.
News March 23, 2025
ఇలాగే ఆడితే RCBదే కప్: పఠాన్

ఆర్సీబీ ‘ఈసాల కప్ నమ్దే’ కోరిక ఈసారి తీరే అవకాశాలు కనిపిస్తున్నాయని మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ అన్నారు. ‘ఆర్సీబీకి మంచి బౌలింగ్ యూనిట్ ఉంది. కచ్చితంగా టాప్-4లో ఉంటారు. ఫస్ట్ మ్యాచ్‌లో దక్కిన శుభారంభాన్ని ఇలాగే కొనసాగిస్తారని ఆశిస్తున్నా. కెప్టెన్ పాటీదార్ రిస్కులు తీసుకుంటున్నారు. అతనిలో నాకు నచ్చేది అదే’ అని పేర్కొన్నారు.