News April 11, 2024
టీనేజర్ల రక్షణ కోసం ఏఐ: మెటా

ఇన్‌స్టాగ్రామ్‌లో సెక్స్‌టార్షన్/లైంగిక వేధింపులు నుంచి టీనేజర్లకు రక్షణగా ఏఐ టూల్ లాంచ్ చేయనున్నట్లు మెటా వెల్లడించింది. న్యూడిటీ ప్రొటెక్షన్ అనే టూల్ ప్రయోగ దశలో ఉందని తెలిపింది. మెసేజింగ్ ద్వారా మైనర్లకు అసభ్యకర ఫొటోలు వస్తే వాటిని గుర్తించి బ్లర్ చేసేలా టూల్‌ను డిజైన్ చేస్తున్నట్లు వివరించింది. దీంతో యూజర్లకు అనవసర కంటెంట్ కనపడదని, వారికి ఆ ఇమేజ్ చూడాలా? వద్దా అనే ఛాయిస్ ఉంటుందని తెలిపింది.
Similar News
News February 15, 2026
ఏపీలో రేపు ఆప్షనల్ హాలిడే.. తెలంగాణలో నో

ఈసారి శివరాత్రి ఆదివారం రావడంతో పబ్లిక్ హాలిడే అదే రోజు వర్తిస్తుంది. అయితే ఉద్యోగులు జాగరణ చేసి తర్వాతి రోజు డ్యూటీ చేయడం కష్టమని ఏపీ ప్రభుత్వం సోమవారం <<19142894>>ఆప్షనల్ హాలిడే<<>> ఇచ్చింది. దీంతో కొందరు ఉద్యోగులు సెలవు తీసుకునే అవకాశం ఉంది. స్కూళ్లు మాత్రం యథావిధిగా నడవనున్నాయి. అటు తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి సెలవు (ఆప్షనల్ సహా) ప్రకటించలేదు.
News February 15, 2026
నరనారాయణులు ఎవరు?

మహావిష్ణువు కవల అవతారాలే నరనారాయణులు. వీరు లోక కల్యాణం కోసం బదరీ క్షేత్రంలో కఠోర తపస్సు చేశారు. వీరే కృష్ణార్జునులుగా జన్మించారని పురాణాలు చెబుతున్నాయి. సహస్ర కవచాంతకుడనే రాక్షసుడిని సంహరించడానికి ఒకరు తపస్సు, మరొకరు యుద్ధం చేస్తూ వేల ఏళ్లు పోరాడారు. వీరు బదరీ వృక్షం కింద నివసించడం వల్లే శివరాత్రి నాడు ఆ పండ్లను నైవేద్యంగా పెట్టే సంప్రదాయం ఏర్పడింది. వీరు జ్ఞానానికి, తపస్సుకు నిలువెత్తు రూపాలు.
News February 15, 2026
భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారా?

భావోద్వేగాలు అందరిలోనూ ఉంటాయి. కానీ భావోద్వేగాలను నియంత్రించుకోలేకపోవడం వల్ల జీవితంలో సమస్యలు వచ్చే అవకాశం ఉందంటున్నారు నిపుణులు. ఇలా కాకుండా ఉండాలంటే జర్నలింగ్, ధ్యానం పాటించాలి. మానసిక, శారీరక ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. ఆరోగ్యకర ఆహారం తీసుకోవడంతో పాటు వ్యాయామం చెయ్యడం మంచిది. భావోద్వేగాలు ఉండటం మంచిదే కానీ వాటికి బానిస కాకుండా జాగ్రత్తపడాలని సూచిస్తున్నారు.


