News April 12, 2024
కోహ్లీ రికార్డ్ బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్

ముంబై ఇండియన్స్ స్టార్ క్రికెటర్ రోహిత్ శర్మ ఐపీఎల్‌లో మరో రికార్డు బద్దలు కొట్టారు. గెలిచిన మ్యాచ్‌ల్లో అత్యధిక రన్స్ కొట్టిన రెండో బ్యాటర్‌గా రికార్డు సాధించారు. రోహిత్ ఇప్పటివరకు 3,882 పరుగులు చేశారు. ఈ క్రమంలో ఆర్సీబీ స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (3,876) ని అధిగమించారు. అగ్రస్థానంలో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధవన్ (3,945) ఉన్నారు.
Similar News
News March 7, 2026
CEC వేలు కోసేసే వాడిని.. TMC ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు!

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘సీఎం మమతా బెనర్జీతో CEC చెడుగా ప్రవర్తించారు. CM వైపు వేలు ఎత్తడానికి ధైర్యం చేశారు. CEC కాకపోయుంటే నేను అదే రోజు ఆయన వేలును కోసేసే వాడిని’ అని కోల్‌కతాలో నిరసన కార్యక్రమంలో అన్నారు. SIR విషయంలో గత నెలలో జ్ఞానేశ్ కుమార్, మమత మధ్య జరిగిన సంభాషణను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.
News March 7, 2026
28,740 పోస్టులు.. ఫలితాలు విడుదల

పోస్టాఫీసుల్లో 28,740 బీపీఎం, GDS, ఏబీపీఎం పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. ఫస్ట్ షార్ట్‌లిస్ట్‌ను తపాలా శాఖ <
News March 7, 2026
ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయా?

ఇరాన్ ఆయుధ నిల్వలు అడుగంటాయని అమెరికా చెబుతోంది. 2 రోజులుగా ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై దాడులు తగ్గాయని అంటోంది. క్షిపణి దాడులు 90 శాతం, డ్రోన్ దాడులు 83 శాతం తగ్గినట్లు వైట్‌హౌస్ పేర్కొంది. మరోవైపు ఇరాన్ వద్ద కేవలం 1,000 బాలిస్టిక్ మిసైళ్లు మాత్రమే ఉండొచ్చని యూరేషియా గ్రూప్ ప్రెసిడెంట్ ఇయాన్ బ్రెమ్మర్ అంచనా వేశారు. యుద్ధం మొదట్లో మాదిరి ఇప్పుడు పెద్ద సంఖ్యలో డ్రోన్ దాడులు చేయట్లేదని చెప్పారు.


