News April 12, 2024

ఐస్‌క్రీమ్ ఆరోగ్యానికి మంచిదేనా?

image

ఐస్‌క్రీమ్ అంటే ఇష్టపడని వారుండరు. కానీ దాంట్లో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటుందని.. అది చెడు కొలెస్ట్రాల్‌గా మారుతుందని కొందరు భయపడుతుంటారు. కానీ ఐస్‌క్రీమ్ ఆరోగ్యానికి హానికరం కాదని హార్వర్డ్ డాక్టరల్ విద్యార్థులు చెబుతున్నారు. ఇది కంటి చూపు, మెదడు అభివృద్ధికి దోహదపడుతుంది. ఒత్తిడి తగ్గించి మానసిక స్థితిని మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బరువు కూడా తగ్గే ఛాన్స్ ఉంది.

Similar News

News March 22, 2026

ఇదేందయ్యా ఇది.. మటన్ ఉడకలేదని పోలీస్ స్టేషన్‌కు..

image

AP: అనంతపురం పోలీసులకు వింత ఫిర్యాదు అందింది. తాడిపత్రికి చెందిన ఓ వ్యక్తి ఉగాది సందర్భంగా మటన్, తలకాయ కొనుగోలు చేశాడు. కుక్కర్‌లో సుమారు 20 సార్లు ఉడికించినా ఆ మాంసం ఉడకలేదని విక్రయదారుడిపై ఫిర్యాదు చేసేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడు. వండిన పాత్రతో సహా వెళ్లడంతో పోలీసులు అవాక్కయ్యారు. అతనికి సర్ది చెప్పి ఇంటికి పంపించారు.

News March 22, 2026

ఈ గ్రామంలో వర్షమే కురవదు!

image

యెమెన్‌లోని అల్ హుతైబ్ గ్రామం ప్రపంచంలోనే అత్యంత వింతైన ప్రదేశం. సముద్ర మట్టానికి సుమారు 3,200 మీటర్ల ఎత్తున పర్వత శిఖరంపై ఉండటం వల్ల ఇక్కడ అసలు వర్షమే కురవదు. మేఘాలన్నీ ఈ గ్రామం కంటే తక్కువ ఎత్తులోనే ఏర్పడటం వల్ల వర్షం పడదు. అందుకే దీనిని ‘డ్రై సిటీ’ అని పిలుస్తారు. ఇక్కడ మేఘాలు చేతికి తాకే ఎత్తులోనే ఉండటం విశేషం. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ‘వంద రోజుల్లో-వంద వింతలు’లో

News March 22, 2026

యుద్ధంతో పర్యావరణానికీ భారీ విధ్వంసం

image

పశ్చిమాసియాలో యుద్ధం పర్యావరణాన్నీ నాశనం చేస్తోంది. 2 వారాల్లో 5 మి. టన్నుల గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలు(CO2, CH4, N20) విడుదలైనట్లు ఓ నివేదిక వెల్లడించింది. ‘ఇరాన్‌లో 20K భవనాలు దెబ్బతినడంతో 2.4M టన్నుల CO2 రిలీజైంది. 2.5-5.9మి. బ్యారెళ్ల చమురు ధ్వంసమవడంతో 1.88M టన్నుల C02 గాల్లో కలిసింది. దేశాలు వాడిన ఇంధనం, కోల్పోయిన జెట్స్, డ్రోన్లు, క్షిపణుల వల్ల కూడా విష పదార్థాలు విడుదలయ్యాయి’ అని తెలిపింది.