News April 12, 2024
కవలలు.. టెన్త్, ఇంటర్‌లో సమాన మార్కులు

కర్ణాటకలోని హసన్‌కు చెందిన కవల అమ్మాయిలు చుక్కి, ఇబ్బనిచంద్ర తాజాగా విడుదలైన ఇంటర్(PUC) ఫలితాల్లో సమాన మార్కులు సాధించారు. వీరికి 600 మార్కులకుగానూ 571 మార్కులు వచ్చాయి. విశేషం ఏమిటంటే రెండేళ్ల కిందట పదో తరగతి ఫలితాల్లో ఈ కవలలిద్దరికీ 625 మార్కులకు 620 మార్కులొచ్చాయి. ఇది పూర్తిగా యాదృచ్ఛికమని, సమాన మార్కులు ఎలా వచ్చాయో తమకే అర్థంకావడం లేదని వారు ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
Similar News
News March 27, 2026
ఇన్ఫెక్షన్లతో గుండెపోటు.. వైద్యుల సలహా ఇదే!

రక్తపరీక్షలు సాధారణంగా ఉన్నా, స్వల్పకాలిక ఇన్ఫెక్షన్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘ఇవి శరీరంలో వాపును పెంచి, రక్తాన్ని గడ్డకట్టేలా చేస్తాయి. దీనివల్ల ధమనుల్లోని ప్లాక్ పగిలి ఆకస్మిక గుండెపోటుకు దారితీయొచ్చు. అనారోగ్యంతో ఉన్నప్పుడు కఠినమైన వ్యాయామాలు చేయకండి. నోటి పరిశుభ్రత పాటించండి. గుండె ఆరోగ్యం కోసం అవసరమైనప్పుడు విశ్రాంతి తీసుకోవడమూ ముఖ్యమే’ అని సూచిస్తున్నారు.
News March 27, 2026
రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరా పెంపు

రాష్ట్రాలకు కమర్షియల్ ఎల్పీజీ సరఫరాను కేంద్ర ప్రభుత్వం 50% నుంచి 70%కి పెంచింది. ఈ మేరకు రాష్ట్రాలకు పెట్రోలియం శాఖ లేఖలు రాసింది. ఉక్కు, రసాయనాలు, ఆటో మొబైల్స్, వస్త్రాలు, రంగుల వంటి పరిశ్రమలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రీ క్రైసిస్ కోటాను 40% నుంచి 50%కి పెంచింది. మరోవైపు దేశంలో యూరియా కొరత లేదని, సరిపడా యూరియా నిల్వలు ఉన్నాయని కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పష్టం చేశారు.
News March 27, 2026
IPL జట్లకు ఆదాయం ఎలా వస్తుంది? ఏ టీమ్ ఎక్కువ సంపాదించింది?

IPLలోని 10 జట్లకు యాడ్స్, మీడియా రైట్స్, స్పాన్సర్‌షిప్స్, టికెట్ విక్రయాల ద్వారా ఆదాయం వస్తుంది. దేశ, విదేశాల్లో ఆడే టోర్నమెంట్స్ వల్ల ఆదాయంలో హెచ్చుతగ్గులు ఉంటాయి. IPL, ILT20, మేజర్ క్రికెట్ లీగ్, కరీబియన్ ప్రీమియర్ లీగ్ ఆడే KKR 2025లో అత్యధికంగా ₹756Cr సంపాదించింది. తర్వాతి స్థానాల్లో CSK(₹674Cr), MI(₹665Cr), SRH(₹642Cr), RR(₹635Cr), DC(₹603Cr), GT(₹559Cr), RCB(₹504Cr), PBKS(₹471Cr) ఉన్నాయి.


