News November 16, 2025

ప్రభుత్వం విఫలం.. క్వింటాల్‌కు ₹2వేల నష్టం: KTR

image

TG: పత్తి కొనుగోళ్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR మండిపడ్డారు. ‘ప్రస్తుతం క్వింటాల్‌కు ₹8,110 కనీస మద్దతు ధర ఉంది. అయినప్పటికీ బహిరంగ మార్కెట్‌లో రైతులకు ₹6,000-7,000 మాత్రమే దక్కుతోంది. రైతులు క్వింటాల్‌పై ₹2,000 వరకు నష్టపోతున్నారు. తేమ ఎక్కువగా ఉన్న పత్తిని కొనకుండా CCI కఠినంగా వ్యవహరిస్తోంది’ అని ఫైరయ్యారు.

Similar News

News November 16, 2025

TELANGANA NEWS

image

✦ టోక్యో డెఫ్లింపిక్స్-2025 షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు రూ.1.20కోటి నజరానా: మంత్రి శ్రీహరి
✦ కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో BJP MP ఈటల భేటీ.. కొంపల్లి ఫ్లైఓవర్ పనులు వేగవంతం చేయాలని, బాలానగర్-నరసాపూర్ హైవేలో, నాగార్జునసాగర్ ఎక్స్ రోడ్ వైపు ఫ్లై ఓవర్లు నిర్మించాలని విజ్ఞప్తి
✦ తొలి విడతలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చాం.. అర్హులందరికీ ఇస్తాం: మంత్రి పొంగులేటి

News November 16, 2025

WTC: నాలుగో స్థానానికి పడిపోయిన భారత్

image

SAతో తొలి టెస్టులో ఓటమితో భారత్ WTC పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయింది. టీమ్ ఇండియా ఈ సీజన్‌లో 8 మ్యాచ్‌లు ఆడి 4 విజయాలు, 3 ఓటములు, ఓ మ్యాచ్ డ్రాగా ముగించింది. ప్రస్తుతం IND విజయాల శాతం 54.17గా ఉంది. ఇక ఆడిన 3 మ్యాచుల్లోనూ గెలిచిన AUS అగ్రస్థానంలో ఉండగా, సఫారీలు(విజయాల శాతం 66.67) రెండో స్థానంలో ఉన్నారు. 3, 5, 6, 7వ స్థానాల్లో SL(66.7), PAK(50.00), ENG(43.33), BAN(16.7) ఉన్నాయి.

News November 16, 2025

టెట్​ ఫలితాల విడుదల అప్పుడే: విద్యాశాఖ

image

TG: టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(TET)​ దరఖాస్తుల ప్రక్రియ నిన్నటి నుంచి ప్రారంభమైంది. వచ్చే ఏడాది జనవరి 03 నుంచి 31 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ ​పరీక్షల ఫలితాలను ఫిబ్రవరి 10-16వ తేదీ మధ్య వెల్లడిస్తామని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఈడబ్ల్యూఎస్​ కోటా అభ్యర్థులు కూడా జనరల్​ కోటా మాదిరిగానే మార్కులు సాధించాల్సి ఉంటుందని పేర్కొంది.