News April 13, 2024
14వ రోజుకు చేరిన జగన్ బస్సు యాత్ర

AP: సీఎం జగన్ చేపట్టిన ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర 14వ రోజుకు చేరింది. ఉమ్మడి గుంటూరు(D) నంబూరు బైపాస్ నుంచి యాత్ర ప్రారంభం కానుంది. కాజా, మంగళగిరి బైపాస్, CK కన్వెన్షన్ మీదుగా యాత్ర సాగనుంది. ఉదయం 11 గంటలకు చేనేత కార్మికులతో జగన్ ముఖాముఖి కానున్నారు.
Similar News
News March 12, 2026
కొవిడ్ టీకాతో మరణాలు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

కొవిడ్ టీకా తర్వాత కొన్ని మరణాలు, తీవ్రమైన అనారోగ్యం సంభవించినట్లు GOVT డేటాలో వెల్లడైందని సుప్రీంకోర్టు పేర్కొంది. అలాంటప్పుడు బాధిత కుటుంబాలను కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలని స్పష్టం చేసింది. వారి కోసం నో ఫాల్ట్ కాంపెన్సేషన్ పాలసీ(నష్టం/ప్రమాదం ఎవరి వల్ల జరిగిందో నిరూపించాల్సిన అవసరం లేకుండా పరిహారం ఇవ్వడం)ని రూపొందించాలని ఆదేశించింది. రచన గంగు వేసిన కేసులో ఈ మేరకు తీర్పునిచ్చింది.
News March 12, 2026
GOOD NEWS: వారికి 15 రోజుల సెలవులు

AP: GOVT ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రిటైర్మెంట్‌కు రెండేళ్ల ముందు దాదాపు 50వేల మందికి 15 రోజులు వెల్‌నెస్ లీవ్ ఇవ్వనున్నట్లు కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సౌరభ్ గౌర్ వెల్లడించారు. అలాగే రూ.50వేల వరకు హెల్త్ బెనిఫిట్స్ అందజేస్తామని తెలిపారు. సెలవుల్లో టెస్టులు చేయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెట్టేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ల సదస్సులో పేర్కొన్నారు.
News March 12, 2026
చైనాకు 1.2 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు?

హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే చమురు నౌకలపై దాడి చేస్తామని బెదిరిస్తున్న ఇరాన్.. ఆ మార్గం ద్వారా వెళ్లే తన షిప్‌మెంట్స్‌ను మాత్రం ఆపలేదని తెలుస్తోంది. యుద్ధం ప్రారంభమైన దగ్గరి నుంచి తమ ప్రధాన ఇంపోర్టర్ అయిన చైనాకు దాదాపు 1.2 కోట్ల బ్యారెళ్ల చమురు పంపినట్లు సమాచారం. అమెరికా/ఇజ్రాయెల్‌పై ఒత్తిడి పెంచడం కోసం హార్ముజ్‌ను ఆయుధంగా వాడుకుంటున్న ఇరాన్ వల్ల భారత్ సహా అనేక దేశాల చమురు నౌకలు ఆగిపోయాయి.


