News April 13, 2024
కాంగ్రెస్ వెన్నుపోటు పార్టీ: కిషన్ రెడ్డి

TG: కాంగ్రెస్ అంటే వెన్నుపోటు పార్టీ అని BJP రాష్ట్రాధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆరోపించారు. ‘గత పదేళ్లలో KCR కుటుంబం రూ.వేల కోట్లు దోచుకుంది. అందుకే వారిని ప్రజలు ఇంటికి పంపారు. కానీ కాంగ్రెస్ వచ్చాక ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డ చందంగా మారింది. హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైంది. రుణమాఫీ చేయలేదు. రైతుబంధు వేయలేదు. అన్ని వర్గాల ప్రజలను మోసం చేసింది’ అని ఆయన మండిపడ్డారు.
Similar News
News March 5, 2026
4 రోజుల్లో రూ.9,560 తగ్గిన 10గ్రా.ల గోల్డ్ రేటు

బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ వీటి ధరలు స్వల్పంగా తగ్గాయి. 24 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.980 తగ్గి రూ.1,63,530కు చేరింది. నాలుగు రోజుల్లోనే రూ.9,560 తగ్గడం విశేషం. 22క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు రూ.900 పతనమై రూ.1,49,900 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులేదు. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.2,95,000గా ఉంది.
News March 5, 2026
రష్మిక చెల్లిని చూశారా?

రష్మిక-విజయ్ రిసెప్షన్ నిన్న HYDలో ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత తొలిసారి రష్మిక ఫ్యామిలీ కెమెరాల కంటపడింది. దీంతో వారి వీడియోలు, ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆమె చెల్లి 14ఏళ్ల షిమాన్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. రిసెప్షన్‌కు వచ్చిన అతిథులకు రష్మిక తన చెల్లిని పరిచయం చేస్తూ కనిపించారు. షిమాన్‌కు తనకు 15ఏళ్ల ఏజ్ గ్యాప్ వల్ల ఆమెను బిడ్డలా చూసుకుంటానని గతంలో రష్మిక తెలిపారు.
News March 5, 2026
తేరుకున్న మార్కెట్లు.. లాభాల్లో ప్రారంభం

ఇరాన్ వార్ వేళ దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ లాభాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా, నిఫ్టీ 100 పాయింట్లకు పైగా లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. గత 3 సెషన్లలో భారీ నష్టాలు చవిచూడగా ఇవాళ ఇన్వెస్టర్లు అనూహ్యంగా పెట్టుబడులు పెడుతున్నారు. దీంతో కోల్ ఇండియా, రిలయన్స్, అదానీ పోర్ట్స్, ONGC, NTPC షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి.


