News April 13, 2024

సరికొత్త రికార్డుకు చేరువలో చాహల్

image

IPLలో సరికొత్త రికార్డు నెలకొల్పడానికి యుజ్వేంద్ర చాహల్(RR) చేరువలో ఉన్నారు. మరో 3 వికెట్లు తీస్తే 200 వికెట్ల మైలురాయిని చేరుకున్న తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించనున్నారు. ప్రస్తుతం అతను 150 మ్యాచ్‌లలో 197 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత బ్రావో(183), చావ్లా(181), అమిత్ మిశ్రా(173), భువనేశ్వర్(173), అశ్విన్(172) ఉన్నారు. వీరిలో బ్రావో తప్ప మిగతా అందరూ ఇంకా క్రికెట్ ఆడుతున్నారు.

Similar News

News March 14, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 14, 2026

ఇరాన్ అగ్రనేతల సమాచారమిస్తే ₹92Cr రివార్డు

image

ఇరాన్ టాప్ లీడర్ల గురించి సమాచారం ఇచ్చిన వారికి $10m (₹92.5కోట్ల) వరకూ రివార్డు ఇస్తామని యూఎస్ ప్రకటించింది. రక్షణ కూడా కల్పిస్తామని హామీ ఇచ్చింది. US ప్రకటించిన లిస్టులో సుప్రీం లీడర్ మొజ్తబా సహా మరో 9 మంది పేర్లు ఉన్నాయి. మరోవైపు US మిలిటరీకి సంబంధించిన సమాచారమిస్తే 150 మిలియన్ ఇరాకీ దినార్లు (₹కోటి) రివార్డుగా ఇస్తామని ఇరాన్ మద్దతు సంస్థ ‘ఇస్లామిక్ రెసిస్టెన్స్ ఇన్ ఇరాక్’ ప్రకటించింది.

News March 14, 2026

ఈరోజు నమాజ్ వేళలు (14-3-2026) శనివారం

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.13 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.20 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.26 గంటలకు
♦︎ అసర్: మధ్యాహ్నం 3.48 గంటలకు
♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.26 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.38 గంటలకు
➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.