News April 13, 2024
హీరో ధనుశ్ తండ్రినని కోర్టుకెక్కిన వ్యక్తి మృతి

స్టార్ హీరో ధనుశ్ తన కొడుకే అంటూ 2015లో కేసు వేసిన కతిరేశన్ మృతి చెందారు. ధనుశ్ స్కూల్ నుంచి తమకు చెప్పకుండా పారిపోయి దర్శకుడు కస్తూరి రాజాకు దత్తపుత్రుడు అయ్యాడని కతిరేశన్ దంపతులు పేర్కొనడం అప్పట్లో సంచలనమైంది. ఈ విషయమై వారు కోర్టులను కూడా ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. కాగా గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న కతిరేశన్ నిన్న మధురై ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందారు.
Similar News
News March 26, 2026
ఇకపై అమరావతిలోనే శిక్షణ

రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శిక్షణ సంస్థ- APSIRD & PR క్యాంపస్ అమరావతిలో ఏర్పాటు కానుంది. ఈ క్యాంపస్‌కై అమరావతిలోని కురగల్లు, నవులూరులో 5.043 ఎకరాల భూమిని CRDA కేటాయించగా.. సంబంధిత లీజు అగ్రిమెంట్ బుధవారం పూర్తయ్యింది. ఈ మేరకు పంచాయితీరాజ్ శాఖ అధికారి రాధామాధవికి, CRDA అధికారి జుబిన్ రాయ్ పత్రాలను అందజేశారు.
News March 26, 2026
BREAKING: పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ స్వల్పంగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.220 పెరిగి రూ.1,46,890కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.200 పెరిగి రూ.1,34,650 పలుకుతోంది. అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పు లేదు. కేజీ సిల్వర్ రేటు రూ.2.60 లక్షలుగా ఉంది.
News March 26, 2026
బంకుల్లో ‘నో స్టాక్’కు కారణాలివే..

బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులకు కారణం ఇంధన కొరత కాదు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కావడంతో పాత బాకీలు చెల్లిస్తేనే కొత్త స్టాక్ ఇస్తామని కంపెనీలు కండిషన్ పెడుతుంటాయి. ఈ నగదు సర్దుబాటు చేయలేక డీలర్లు ఆర్డర్లు ఆపేశారు. దీనికి తోడు పెట్రోల్ అయిపోతుందనే భయంతో జనం ‘పానిక్ బయింగ్’ చేస్తూ ట్యాంకులు ఫుల్ చేయిస్తుండటంతో 2 రోజుల స్టాక్ ఒక్కరోజులోనే ఖాళీ అవుతోంది. సంస్థల వద్ద మాత్రం నిల్వలకు ఎలాంటి ఇబ్బందీ లేదు.


