News April 13, 2024
IPL: రాజస్థాన్ విజయం

ఐపీఎల్‌లో ఈరోజు జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌పై రాజస్థాన్ గెలిచింది. 148 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్ఆర్ ఛేదనలో చెమటోడ్చింది. ఆఖర్లో హెట్మెయిర్ 10 బంతుల్లో 27 పరుగులతో మెరుపులు మెరిపించడంతో గట్టెక్కింది. ఆర్ఆర్ బ్యాటర్లలో యశస్వి(39) రాణించారు. ఇక పంజాబ్ బౌలర్లలో రబాడ, కరన్ చెరో 2 వికెట్లు, అర్షదీప్, లివింగ్‌స్టన్, హర్షల్ తలో వికెట్ తీశారు. రాజస్థాన్‌కు ఇది ఐదో విజయం కావడం విశేషం.
Similar News
News March 15, 2026
అభిషేక్, నేను అగ్ని లాంటోళ్లం: సంజు శాంసన్

అభిషేక్ శర్మ, తాను ఐస్-ఫైర్‌లా ఉండమని, తాము కలిస్తే అగ్నికి అగ్ని తోడైనట్లేనని సంజూ శాంసన్ అన్నారు. ‘ఓపెనింగ్‌లో కొన్నిసార్లు నేను, ఇంకొన్నిసార్లు అభిషేక్ దూకుడుగా ఆడాం. 2024 నుంచి ఇదే చేస్తున్నాం’ అని ఇండియా టుడే కాంక్లేవ్‌లో చెప్పారు. ఇంతకుముందు అభిషేక్ ఫాలోయింగ్‌ను చూసి అసూయపడేవాళ్లమని పేర్కొన్నారు. జట్టులో అతడో సూపర్ స్టార్ అని, త్వరగా పెళ్లి చేసుకోవాలని జోక్ చేశారు.
News March 15, 2026
తిరుమల వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్!

తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు మరిన్ని సౌకర్యాలను TTD అందుబాటులోకి తీసుకొస్తోంది. వసతి గృహాల్లో దిండు, దుప్పటి, చాప, బెడ్‌షీట్‌లను ఇవ్వనుంది. తొలుత నందకంలో ఇవ్వడం ప్రారంభించగా భక్తుల నుంచి సానుకూల స్పందన వచ్చింది. దీంతో వకుళామాత, పాంచజన్యం, కౌస్తుభం తదితర గెస్ట్‌హౌసుల్లోనూ అందజేయాలని నిర్ణయించింది. దుప్పటి-₹10, 2 దిండ్లు-₹10, చాప-₹10, బెడ్‌షీట్-₹20 చొప్పున చెల్లించి తీసుకోవచ్చు.