News April 14, 2024
అకాల వర్షాలతో రైతులకు దెబ్బ
TG: అకాల వర్షాలు రైతన్నలను నిండా ముంచుతున్నాయి. నిన్న నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, ములుగు, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు కురిశాయి. దీంతో వరి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. మరోవైపు పలు చోట్ల మార్కెట్ యార్డుల్లో షెడ్లు లేకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. సరైన ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. పలు చోట్ల మద్దతు ధరకు పంట కొనుగోలు చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 17, 2024
TODAY HEAD LINES
* సీఎం చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు కన్నుమూత
* సనాతన ధర్మాన్ని రక్షించేందుకే జనసేన, శివసేన: పవన్
* ఏడాదిలో 50 వేల ఉద్యోగాలు ఇచ్చాం: సీఎం రేవంత్
* రేవంత్‌ను బండి సంజయ్ కాపాడుతున్నారు: కేటీఆర్
* బైడెన్ లాగే మోదీకి మతిపోయింది: రాహుల్ గాంధీ
* సినీ నటి కస్తూరి అరెస్ట్
* హీరో ధనుష్‌పై హీరోయిన్ నయనతార సంచలన ఆరోపణలు
* పెళ్లి చేసుకున్న టాలీవుడ్ సింగర్లు
* మరోసారి తండ్రైన రోహిత్ శర్మ
News November 17, 2024
సురక్షితమైన మూడు బ్యాంకులివే!
ఇండియాలో పదుల సంఖ్యలో ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకులున్నాయి. అయితే, వాటిలో సురక్షితమైనవేవో తెలుసుకుందాం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తెలిపిన వివరాల ప్రకారం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్‌లు దేశంలో సురక్షితమైనవి. ఈ మూడింటిని ముఖ్యమైన డొమెస్టిక్ బ్యాంకులుగా RBI గుర్తించింది. మరి మీకు ఏ బ్యాంకులో అకౌంట్స్ ఉన్నాయో కామెంట్ చేయండి.
News November 17, 2024
‘పుష్ప 2’ ఈవెంట్‌కు సుకుమార్ దూరం.. ఎందుకంటే?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ లాంఛ్ రేపు పట్నాలో జరగనుంది. ఈ వేడుకకు డైరెక్టర్ సుకుమార్ హాజరవడం లేదని తెలుస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన పెండింగ్ పనులు ఎక్కువగా ఉండటంతో వాటిని ఫినిష్ చేసేందుకు ఆయన హైదరాబాద్‌లోనే ఉంటారని సమాచారం. మరోవైపు రేపటి ఈవెంట్‌లో బిగ్ బాస్ ఫేమ్ అక్షర్ సింగ్ స్పెషల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వచ్చే నెల 5న మూవీ రిలీజ్ కానుంది.