News April 14, 2024
విద్యుత్ షాక్‌తో మరణిస్తే రూ.5 లక్షల పరిహారం

TG: విద్యుత్ షాక్‌తో మరణిస్తే ప్రభుత్వం రూ.5 లక్షల నష్టపరిహారం చెల్లిస్తుంది. విద్యుత్తు స్తంభాలను ముట్టుకోవడం, విద్యుత్ లైన్ల కింద, ట్రాన్స్‌ఫార్మర్ల వద్ద సంభవించే మరణాలకు ఈ పరిహారం అందజేస్తుంది. ఎఫ్ఐఆర్, పంచనామా రిపోర్ట్, డెత్ సర్టిఫికెట్ సంబంధిత డాక్యుమెంట్లను విద్యుత్ కార్యాలయంలో సమర్పిస్తే ఏఈ, డీఈ విచారణ ఆధారంగా పరిహారాన్ని పొందవచ్చు. శాఖ పరమైన తప్పిదాల వల్ల మరణిస్తేనే పరిహారం చెల్లిస్తారు.
Similar News
News March 16, 2026
‘పద్మ వ్యూహం’ నిర్మాణం ఎలా ఉంటుందంటే?

బయటపడలేని సమస్యల్లో ఉన్నప్పుడు ‘పద్మవ్యూహం’లో ఇరుక్కుపోయారని అంటారు. భారతంలో ద్రోణాచార్యుడు పన్నిన శత్రు దుర్భేద్యమైన యుద్ధ నిర్మాణమే పద్మవ్యూహం. తామరపువ్వు ఆకారంలో 7 వలయాల్లో రథ, గజ, అశ్వ, పదాతి సైన్యాలతో ఉంటుంది. ఇందులోకి వెళ్లిన అభిమన్యుడు తనువు చాలించారు. దీన్ని ఛేదించగలిగేది కృష్ణుడు, ప్రద్యుమ్నుడు, భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యుడు, కర్ణుడు, అశ్వత్థామ, అర్జునుడు మాత్రమే.
<<-se>>#EPICSAYINGS<<>>
News March 16, 2026
నోటీసుల డ్రామా వద్దు.. MPతో రాజీనామా చేయించండి: YCP

AP: డ్రగ్స్ తీసుకొని పట్టుబడిన MP మహేశ్‌కు బెయిల్ ఇప్పించడమే కాకుండా, షోకాజ్ నోటీసు పేరిట డ్రామా చేస్తారా? అని CM CBNపై YCP ధ్వజమెత్తింది. ‘మహిళలపై వేధింపులకు పాల్పడిన కూటమి MLAలు శ్రీధర్, ఆదిమూలం, రవికుమార్, అహ్మద్, మంత్రి సంధ్యారాణి PAపై చర్యలు లేవు. ఫొటోలతో అడ్డంగా దొరికిన TTD ఛైర్మన్‌పైనా నో యాక్షన్. MPతో రాజీనామా చేయించి అందరిపై చర్యలు తీసుకోవాలి. లేకుంటే ప్రజలు క్షమించరు’ అని పేర్కొంది.
News March 16, 2026
పశ్చాత్తాపం అంటే ఇదేనేమో.. దొంగిలించిన నగలను తిరిగిచ్చాడు!

AP: తిరుపతి జిల్లా నాయుడుపేటలో ఓ వింత ఘటన జరిగింది. ఓ నిశ్చితార్థ వేడుకకు హాజరైన దంపతుల బంగారు నగలను కాజేశాడో దొంగ. ‘పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం లేదు’ అనుకున్నాడో ఏమో.. 20 రోజుల తర్వాత ఆ నగలను బాధితుల ఇంటికే కొరియర్‌లో పంపించాడు. ఇంటి ముందున్న పార్సిల్ చూసి షాకైన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వేలిముద్రల ఆధారంగా దొంగ ఎవరో తేల్చేపనిలో పోలీసులున్నారు.


