News April 14, 2024

DHONI: ఏంది సామీ ఈ క్రేజ్?

image

ORMAX Media సర్వే ప్రకారం IPL-2024లో మూడో వారంలోనూ మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా చెన్నై స్టార్ ప్లేయర్ మహేంద్ర సింగ్ ధోనీ నిలిచారు. తొలి రెండు వారాలు కూడా ధోనీనే మోస్ట్ పాపులర్ ప్లేయర్‌గా ఉన్నారు. ఈ సీజన్‌లో ధోనీ తన బ్యాటింగ్‌తో ఫ్యాన్స్‌ను అలరిస్తున్నారు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో తనదైన స్టైల్‌లో సిక్సర్లు బాది ప్రేక్షకులకు ఎంటర్టైన్‌మెంట్ అందించారు. ఆ మ్యాచ్‌లో 16 బంతుల్లోనే 37 పరుగులు చేశారు.

Similar News

News March 20, 2026

ఇండస్ట్రియల్ డీజిల్ ధర రూ.22 పెంపు

image

గల్ఫ్ యుద్ధ ప్రభావంతో దేశంలో ఇండస్ట్రియల్ డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. లీటర్‌పై రూ.22 పెంచుతున్నట్లు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) ప్రకటించింది. దీంతో ప్రస్తుతం రూ.87.57 ఉన్న ధర రూ.109.59కి చేరింది. ఈ డీజిల్‌ను పరిశ్రమలు, రవాణా, పవర్ జనరేషన్‌‌లో ఉపయోగిస్తారు. ఫలితంగా ప్రొడక్షన్ కాస్ట్, రవాణా ఛార్జీలు పెరగనున్నాయి. దీంతో వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది.

News March 20, 2026

స్టాక్ మార్కెట్లకు జోష్.. రూపాయి డౌన్

image

నిన్నటి భారీ నష్టాల నుంచి ఈరోజు స్టాక్ మార్కెట్లు కోలుకొని లాభాలతో ట్రేడింగ్ ముగించాయి. సెన్సెక్స్ 325 పాయింట్ల లాభంతో 74,532 వద్ద, నిఫ్టీ 112 పాయింట్లు ఎగిసి 23,114 వద్ద సెటిల్ అయ్యాయి. క్రూడ్ టెన్షన్స్ తగ్గడం, కొనుగోళ్లు పెరగడం వంటివి మార్కెట్లలో జోష్ నింపాయి. రూపాయి మాత్రం ఒక డాలరుకు ₹93 మార్క్ దాటి జీవితకాల కనిష్ఠాన్ని నమోదు చేసింది. FII విక్రయాలు, డాలర్ డామినేషన్, యుద్ధం ఇందుకు కారణాలు.

News March 20, 2026

కల్తీ జరిగితే ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

TG: హైదరాబాద్‌లో ఆహార కల్తీ నియంత్రణకు పోలీసులు ‘హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్వైలెన్స్ టీమ్’ను ఏర్పాటు చేశారు. ఇందులో సీఐలు, ఎస్సైలు, ఇతర సిబ్బందితో కలిపి మొత్తం 28 మంది సభ్యులు ఉంటారు. కల్తీకి పాల్పడే వారిని గుర్తించడం, నిఘా ఉంచడం, దాడులు నిర్వహించడం, నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం వీరి బాధ్యత. ఎక్కడైనా కల్తీ జరిగితే టోల్ ఫ్రీ నంబర్ 87126 61212కి కాల్ చేయాలని ప్రజలకు సూచించారు.