News April 15, 2024
18న టైటిల్ గ్లింప్స్ విడుదల
‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా క్రేజ్ సాధించిన తేజా సజ్జ హీరోగా ‘సూపర్ యోధ’ అనే మూవీ ప్రారంభం కానుంది. ఈ సినిమా టైటిల్ అనౌన్స్‌మెంట్ గ్లింప్స్ ఏప్రిల్ 18న విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తుండగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. మంచు మనోజ్ విలన్‌గా, దుల్కర్ సల్మాన్ కీలక పాత్రలో నటించనున్నట్లు సమాచారం.
Similar News
News November 17, 2024
కలెక్టర్‌పై దాడి వెనుక కేటీఆర్.. మంత్రి సంచలన ఆరోపణలు
TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి వెనుక కేటీఆర్ ఉండి ఉంటారని మంత్రి సురేఖ ఆరోపణలు చేశారు. అమాయకులను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిందని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులను విదేశాల్లో దాచారన్నారు. నిజాలు తేల్చాక KTRపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు.
News November 17, 2024
‘కాంతార-2’ నుంచి బిగ్ అప్డేట్
కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘కాంతార ఎ లెజెండ్ చాప్టర్-1’ నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది అక్టోబర్ 2న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటన చేశారు. ఇప్పటికే రిలీజైన ‘కాంతార’ భారీ విజయాన్ని అందుకోగా.. ప్రీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. తెలుగు, కన్నడతో పాటు మొత్తం 7 భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.
News November 17, 2024
మామూనురు ఎయిర్‌పోర్టు అభివృద్ధి నిధులు విడుదల
TG: వరంగల్‌లోని మామూనురు ప్రాంతంలో ఎయిర్‌పోర్టు అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. విమానాశ్రయం విస్తరణలో అవసరమైన భూసేకరణ కోసం రూ.205 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. DPR సిద్ధం చేయాలని ఎయిర్‌పోర్టు అథారిటీకి లేఖ రాసింది.