News November 17, 2024
కలెక్టర్‌పై దాడి వెనుక కేటీఆర్.. మంత్రి సంచలన ఆరోపణలు
TG: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి వెనుక కేటీఆర్ ఉండి ఉంటారని మంత్రి సురేఖ ఆరోపణలు చేశారు. అమాయకులను బలి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల పాలు చేసిందని దుయ్యబట్టారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అధికారులను విదేశాల్లో దాచారన్నారు. నిజాలు తేల్చాక KTRపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. తమ ప్రభుత్వం ఒక్కో హామీని అమలు చేస్తూ ప్రజా సంక్షేమం కోసం పని చేస్తుందన్నారు.
Similar News
News December 4, 2024
హైదరాబాద్‌లో రోశయ్య విగ్రహం: రేవంత్
TG: గతంలో CMగా ఎవరున్నా, నంబర్ 2 మాత్రం రోశయ్యదేనని రేవంత్ రెడ్డి వెల్లడించారు. HYD హైటెక్స్‌లో రోశయ్య వర్ధంతి కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు. ‘సమయం వచ్చినప్పుడు ఆయనే నం.1 అయ్యారు. రోశయ్య నిబద్ధత, సమర్థత వల్లే తెలంగాణ మిగులు రాష్ట్రం ఏర్పడింది. ప్రజలకు మేలు చేసే ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. అలాంటి వ్యక్తికి HYDలో విగ్రహం లేకపోవడం బాధాకరం. మేం ఏర్పాటు చేస్తాం’ అని CM చెప్పారు.
News December 4, 2024
‘సీజ్ ద షిప్’ డ్రామా అట్టర్ ఫ్లాప్: YCP
‘సీజ్ ద షిప్’ డ్రామా బెడిసికొట్టిందని YCP ఎద్దేవా చేసింది. చంద్రబాబు డైరెక్షన్‌లోనే పవన్, నాదెండ్ల ద్వయం రాద్ధాంతం చేశారంది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని యాంకర్ పోర్టు నుంచే బియ్యం ఎగుమతి జరుగుతోందని, సమగ్ర తనిఖీల తర్వాతే షిప్‌లోకి బియ్యం లోడింగ్ చేశారని తెలిపింది. రేషన్ మాఫియా లీడర్లు కూటమి నేతలే అని ఆరోపించింది. మంత్రి పయ్యావుల కేశవ్ వియ్యంకుడి షిప్ ఎందుకు తనిఖీ చేయలేదు? అని ‘X’లో ప్రశ్నించింది.
News December 4, 2024
అల్లు అర్జున్‌కు విషెస్ తెలిపిన మెగా హీరో
భారీ అంచనాలతో రిలీజవుతున్న ‘పుష్ప-2’ సినిమా గురించి మెగా కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడట్లేదని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈక్రమంలో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ‘పుష్ప-2’ టీమ్‌కు విషెస్ తెలిపారు. ‘అల్లు అర్జున్, సుకుమార్ & టీమ్‌కు నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈరోజు రాత్రి నుంచి ‘పుష్ప-2’ ప్రీమియర్స్ మొదలు కానున్నాయి.