News April 15, 2024
కురుపాం అసెంబ్లీ బరిలో ట్రాన్స్‌జెండర్
AP: పార్వతీపురం మన్యం(D) కురుపాం MLA అభ్యర్థిగా ట్రాన్స్‌జెండర్ అడ్డాకుల గీతారాణిని భారత్ ఆదివాసీ పార్టీ నిలబెట్టింది. జియ్యమ్మవలస(M) గొర్లి గ్రామానికి చెందిన గీతా.. BA చదివారు. జిల్లా ట్రాన్స్‌జెండర్స్ గిరి నేస్తం అధ్యక్షురాలిగా ఉన్నారు. ఆదివాసీల అభ్యున్నతి, నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని గీతా తెలిపారు. ఇక్కడ YCP నుంచి మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి, TDP తరఫున జగదీశ్వరి పోటీలో ఉన్నారు.
Similar News
News November 17, 2024
రూ.8 లక్షలతో వ్యాపారం.. ఇప్పుడు రూ.23,567 కోట్ల సామ్రాజ్యం
ఫిన్‌టెక్ కంపెనీ mobikwik ఫౌండర్ బిపిన్ ప్రీత్‌సింగ్ సక్సెస్ స్టోరీ స్ఫూర్తినిస్తోంది. ఢిల్లీ IITలో చదివిన ఆయన డిజిటల్ పేమెంట్స్ హవాను 2000లోనే గుర్తించారు. 9ఏళ్లు కష్టపడి 2009లో ₹8లక్షల సేవింగ్స్‌తో చిన్న రూమ్‌లో MobiKwikను ప్రారంభించారు. భార్య ఉపాసన సహకారంతో కంపెనీని వృద్ధి చేశారు. ప్రస్తుతం ఆ యాప్‌లో 10కోట్ల మంది యూజర్లు ఏటా $2bn లావాదేవీలు జరుపుతున్నారు. కంపెనీ విలువ ₹23,567కోట్లకు చేరింది.
News November 17, 2024
BGT: తొలి టెస్టుకు కెప్టెన్ ఎవరంటే?
ఆస్ట్రేలియాతో జరిగే BGTలో తొలి టెస్టుకు రోహిత్ శర్మ అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఆయన స్థానంలో బుమ్రా భారత కెప్టెన్‌గా వ్యవహరిస్తారని తెలిపాయి. ఇటీవల రోహిత్ భార్య కుమారుడికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన కుటుంబంతోనే ఉండనున్నట్లు తెలుస్తోంది. అయితే హిట్ మ్యాన్ రెండో టెస్టుకు జట్టుకు అందుబాటులో ఉంటారన్నాయి. మరోవైపు గాయపడిన కేఎల్ రాహుల్ కోలుకున్నట్లు సమాచారం.
News November 17, 2024
తొలి రోజు ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-3 పరీక్ష
TG: గ్రూప్-3 పరీక్ష తొలి రోజు ప్రశాంతంగా ముగిసింది. ఇవాళ పేపర్-1, పేపర్-2 పరీక్ష జరగగా రేపు ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు పేపర్-3 పరీక్ష జరగనుంది. కాగా నిమిషం నిబంధన కారణంగా పలువురు అభ్యర్థులను పరీక్షా కేంద్రాల్లోకి అధికారులు అనుమతించలేదు.