News November 17, 2024

రూ.8 లక్షలతో వ్యాపారం.. ఇప్పుడు రూ.23,567 కోట్ల సామ్రాజ్యం

image

ఫిన్‌టెక్ కంపెనీ mobikwik ఫౌండర్ బిపిన్ ప్రీత్‌సింగ్ సక్సెస్ స్టోరీ స్ఫూర్తినిస్తోంది. ఢిల్లీ IITలో చదివిన ఆయన డిజిటల్ పేమెంట్స్ హవాను 2000లోనే గుర్తించారు. 9ఏళ్లు కష్టపడి 2009లో ₹8లక్షల సేవింగ్స్‌తో చిన్న రూమ్‌లో MobiKwikను ప్రారంభించారు. భార్య ఉపాసన సహకారంతో కంపెనీని వృద్ధి చేశారు. ప్రస్తుతం ఆ యాప్‌‌‌లో 10కోట్ల మంది యూజర్లు ఏటా $2bn లావాదేవీలు జరుపుతున్నారు. కంపెనీ విలువ ₹23,567కోట్లకు చేరింది.

Similar News

News December 2, 2024

1500 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కు: అనిత

image

AP: అనకాపల్లి జిల్లా నక్కపల్లి సమీపంలో 1500 ఎకరాల్లో బల్క్ డ్రగ్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత వెల్లడించారు. ఆర్సిలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేస్తున్నామని విశాఖలో క్రెడాయ్ ప్రాపర్టీ షోలో మాట్లాడారు. భూకబ్జాలు, ఆక్రమణలు అరికట్టడంపై తాము స్పెషల్ ఫోకస్ పెట్టామని, ఇందుకోసం ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

News December 2, 2024

ఈరోజు నమాజ్ వేళలు

image

తేది: డిసెంబర్ 02, సోమవారం
ఫజర్: తెల్లవారుజామున 5:14 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:31 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12:06 గంటలకు
అసర్: సాయంత్రం 4:05 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 5:40 గంటలకు
ఇష: రాత్రి 6.57 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News December 2, 2024

భారీగా మారుతీ సుజుకీ కొత్త డిజైర్ అమ్మకాలు

image

తమ తాజా కార్ డిజైర్ అమ్మకాలు ఊపందుకున్నాయని మారుతీ సుజుకీ సంస్థ ప్రకటించింది. ఇప్పటి వరకు 30వేల బుకింగ్స్ రాగా 5వేల కార్లు డెలివరీ చేసినట్లు తెలిపింది. రోజుకు 1000 బుకింగ్స్ వస్తున్నాయని వెల్లడించింది. మొత్తంగా సంస్థ అమ్మకాల్లో గత ఏడాది నవంబరుతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో 5.33శాతం వృద్ధి నమోదైందని స్పష్టం చేసింది. బలేనో, ఎర్టిగా, ఫ్రాంక్స్, బ్రెజా అధికంగా అమ్ముడవుతున్నాయని పేర్కొంది.